Shankar Lalwani: ఇండోర్‌లో ‘డబుల్’ రికార్డ్
ABN , Publish Date - Jun 05 , 2024 | 06:10 AM
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం ఒకేసారి రెండు భారీ రికార్డులను సృష్టించింది. ఇక్కడి విజేతకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.75 లక్షల ఆధిక్యం వచ్చింది. పోలైన ఓట్లలో ‘నోటా’ రెండో స్థానం పొందడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వానీకి సమీప ప్రత్యర్థికన్నా 11,75,092 ఓట్ల మెజార్టీ లభించింది.
బీజేపీకి అత్యధికంగా 11.75 లక్షల మెజార్టీ
భోపాల్, జూన్ 4: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గం ఒకేసారి రెండు భారీ రికార్డులను సృష్టించింది. ఇక్కడి విజేతకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11.75 లక్షల ఆధిక్యం వచ్చింది. పోలైన ఓట్లలో ‘నోటా’ రెండో స్థానం పొందడం గమనార్హం. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ లాల్వానీకి సమీప ప్రత్యర్థికన్నా 11,75,092 ఓట్ల మెజార్టీ లభించింది.
ఆయనకు 12,26,751 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీఎస్సీకి చెందిన సంజయ్ సింగ్ సోలంకీకి 51,659 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ రెండో స్థానం నోటాకు లభించింది. నోటాకు ఏకంగా 2,18,674 ఓట్లు రావడం గమనార్హం.
కాంగ్రెస్ చేసిన ప్రచారమే ఇందుకు కారణం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అక్షయ్‌కాంత్ బామ్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని బీజేపీలో చేరారు. ఇందుకు బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు నోటాకు ఓటు వేయాలంటూ కాంగ్రెస్ పిలుపున్చింది. ఇక టికాంగఢ్ (ఎస్సీ) నియోజకవర్గంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ 4,03,312 మెజార్టీతో గెలుపొందారు. ఆయన వరుసగా ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికకావడం గమనార్హం.