Share News

భారత్‌లో ఇబ్బందుల్లో ముస్లింలు: ఖమేనీ

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:19 AM

భారత్‌లో ముస్లింల పరిస్థితులపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

భారత్‌లో ఇబ్బందుల్లో ముస్లింలు: ఖమేనీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: భారత్‌లో ముస్లింల పరిస్థితులపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఖమేనీ భారత్‌లో ముస్లింల పరిస్థితుల గురించి ప్రస్తావించారు. మయన్మార్‌, గాజాతో పాటు భారత్‌లో కూడా ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కట్లు ఎదుర్కొంటోన్న ముస్లింలను మిగతా ముస్లింలు పట్టించుకోవాలన్నారు. ఖమేనీ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. తప్పుడు సమాచారంతో కూడిన ఆరోపణలు చేశారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే దేశాలు సొంత రికార్డులు పరిశీలించుకోవాలని భారత్‌ హితవు పలికింది.

Updated Date - Sep 17 , 2024 | 04:19 AM