Share News

Viral Video: పోలీసులా? మజాకానా? ఇద్దరు కుర్రాళ్లకు ఉదయాన్నే జైపూర్ పోలీసులు ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటంటే..

ABN , Publish Date - Aug 28 , 2024 | 06:10 PM

ఎంతో నిరాశగా గడుస్తున్న రోజుల్లో ఓ ఉదయం ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైతే ఎలా ఉంటుంది? ప్రత్యేకించి మీరు కళ్లు తెరిచిన వెంటనే ఎవరైనా మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే ఎంత బాగుంటుంది? ఓ శుభోదయాన మీ సమస్యలన్నీ ఒక్కసారిగా మాయం అయితే ఎలా ఉంటుంది?

Viral Video: పోలీసులా? మజాకానా? ఇద్దరు కుర్రాళ్లకు ఉదయాన్నే జైపూర్ పోలీసులు ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటంటే..
Jaipur Police

ఎంతో నిరాశగా గడుస్తున్న రోజుల్లో ఓ ఉదయం ఊహించని సర్‌ప్రైజ్ (Surprise) ఎదురైతే ఎలా ఉంటుంది? ప్రత్యేకించి మీరు కళ్లు తెరిచిన వెంటనే ఎవరైనా మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే ఎంత బాగుంటుంది? ఓ శుభోదయాన మీ సమస్యలన్నీ ఒక్కసారిగా మాయం అయితే ఎలా ఉంటుంది? జైపూర్‌ (Jaipur)కు చెందిన ఇద్దరు కుర్రాళ్లకు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జైపూర్ నుంచి కిడ్నాప్‌ (Kidnap)కు గురైన ఇద్దరు యువకులకు తమ జీవితంలోని బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ను పోలీసులు (Jaipur Police) అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని నహర్‌గఢ్‌కు చెందిన ఓ కుర్రాడు పది రోజుల క్రితం తన స్నేహితుడితో కలిసి వాకింగ్‌కు వెళ్లాడు. ఇద్దరూ ఖరీదైన బట్టలు వేసుకుని ఉండడంతో కొందరు దుండగులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని ఓ హోటల్‌లో వారిద్దిరినీ బందీలుగా ఉంచారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు ఇస్తేనే వదులుతామని బెదిరించారు. ఆ కుటుంబ సభ్యుల వద్ద అంత డబ్బు లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగులను ట్రేస్ చేశారు.


హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లారు. మంగళవారం ఉదయాన్నే చాకచక్యంగా ఆ కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. అప్పటికి నిద్రపోతున్న బాధితులు ఇద్దరినీ నిద్ర లేపి తాము జైపూర్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది వీక్షించారు. దాదాపు 19 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..


Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..


Optical Illusion: మీ కళ్లకు, బ్రెయిన్‌కు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న మరో నలుగురిని కనిపెట్టండి..!


Picture Puzzle: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో గోల్ఫ్ బాల్‌ను 8 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 28 , 2024 | 06:42 PM