Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..
ABN , Publish Date - Aug 28 , 2024 | 04:26 PM
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఢిల్లీ (Delhi)లోని ఓ వీధి వ్యాపారి (Food Vendor) వీడియోను పంచుకున్న ఆనంద్.. అతడిని ప్రాచీన రష్యా చక్రవర్తితో పోల్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఓ ఫుడ్ స్టాల్ కనబడుతోంది. అక్కడి వ్యాపారి వేడిగా ఆహారాన్ని తయారు చేసి కేవలం రూ.50కే విక్రయిస్తున్నాడు. రూ.50 కే ``దాల్ మఖానీ``, ``షాహీ పనీర్``, ``బూండీ రైతా``, ``బటర్``తో పాటు రెండు ఫుల్ సైజ్ చపాతీలు ఇస్తున్నాడు. కేవలం 50 రూపాయలకే అన్ని వెరైటీలు ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ``ఈ పెద్దమనిషిని దేశం యొక్క ద్రవ్యోల్బణ వ్యతిరేక చక్రవర్తిగా నియమించాలి`` అని కామెంట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు. 19 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``రూ.50కే అన్ని వెరైటీలా. నాణ్యత మీద డౌట్ వస్తోంది``, ``అతడు చాలా దయగల వ్యక్తిలా ఉన్నాడు``, ``ఈ ధర చాలా తక్కువ``, ``ఇది నమ్మశక్యంగా లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇదేం పని నాగరాజా.. బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్‌కు చుట్టుకున్న నాగుపాము.. ఫ్యాన్ వేస్తే..
Picture Puzzle: మీ కళ్లు సూపర్ పవర్ఫుల్ అయితే.. ఈ ఫొటోలో గోల్ఫ్ బాల్‌ను 8 సెకెన్లలో కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి