Share News

PM Narendra Modi: ప్రధాని మోదీ ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:40 PM

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తలచింది ఒకటైతే.. జరుగుతోంది మరొకటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) పేర్కొన్నారు. ఆయన ‘కాంగ్రెస్-ముక్త్ భారత్’ని (Congress-mukt Bharat) కోరుకున్నారని, కానీ అందుకు బదులుగా ‘అవినీతి-ముక్త్ కాంగ్రెస్’ (Corrupt-mukt Congress) చేస్తున్నారని సెటైర్లు వేశారు.

PM Narendra Modi: ప్రధాని మోదీ ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తలచింది ఒకటైతే.. జరుగుతోంది మరొకటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) పేర్కొన్నారు. ఆయన ‘కాంగ్రెస్-ముక్త్ భారత్’ని (Congress-mukt Bharat) కోరుకున్నారని, కానీ అందుకు బదులుగా ‘అవినీతి-ముక్త్ కాంగ్రెస్’ (Corrupt-mukt Congress) చేస్తున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లో ఉన్న అవినీతిపరుల్ని తమ బీజేపీలోకి చేర్చుకుంటున్నారని పరోక్షంగా కౌంటర్ వేశారు. మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ (Naveen Jindal) కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన తర్వాత జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం.. ఈడీపై నిప్పులు చెరిగిన ఆప్


ఆదివారం బిజెపిలో చేరిన తర్వాత నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఇది ఎంతో ముఖ్యమైన రోజు. బీజేపీలో చేరినందుకు నేనెంతో గర్వపడుతున్నా. నేను ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయగలను. మోదీ కలలు కన్న వికసిత్ భారత్‌కు సహకరించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఈ పరిణామంపై జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మీకు ఓ పెద్ద వాషింగ్ మెషీన్ అవసరమైనప్పుడు.. ఇలాగే జరుగుతంది. గత పదేళ్లలో పార్టీకి శూన్య సహకారం అందించిన తర్వాత నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పడం నిజంగా పెద్ద జోక్’’ అని ఎద్దేవా చేశారు.

Read Also: బెంగళూరులో నీటి కట కట.. వృథా చేసిన 22 కుటుంబాలకు ఫైన్

‘‘ప్రధాని మోదీ కాంగ్రెస్-ముక్త్ భారత్‌ని కోరుకున్నారు. కానీ.. ఈడీ, సీబీఐ లాంటి వాషింగ్ మెషీన్‌ల సహకారంతో అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నేతలను తన కౌగిలికి చేరిపోయేలా చేసి.. ప్రధాని మోదీ ‘అవినీతి-ముక్త్ కాంగ్రెస్‌’ను చేశారు’’ అని మరో ట్వీట్‌లో జైరాం రమేశ్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌లకు.. మనీలాండరింగ్ కేసుకు (Money Laundering Case) సంబంధించి జిందాల్‌ను నిందితుడిగా ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడంపై వచ్చిన రెండు వార్తా కథనాల స్క్రీన్‌షాట్‌లను కూడా ఆయన జత చేశారు. మరి.. దీనిపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 07:40 PM