Jammu & Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:27 AM
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 350 అడుగుల లోయలో పడి అయిదుగురు మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఐదుగురు జవాన్ల మృతి, మరో అయిదుగురికి గాయాలు
జమ్మూ, డిసెంబరు 24: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 350 అడుగుల లోయలో పడి అయిదుగురు మృతి చెందగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా చర్యల్లో భాగంగా జవాన్లు బాల్‌నోయ్ చెక్‌పోస్టుకు వెళ్తుండగా ఘరోవా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.