Jaya Bachchan: రాజ్యసభ ఫేర్‌వెల్ ప్రసంగంలో క్షమాపణ చెప్పిన జయాబచ్చన్..ఎందుకంటే?

ABN , First Publish Date - 2024-02-09T15:12:52+05:30 IST

ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనూ ఓరకంగా సంచలనమే సృష్టించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విసుర్లు విసిరారు. అయితే తన వీడ్కోలు ప్రసంగంలో సభ్యులందరికీ క్షమాపణలు తెలిపారు.

Jaya Bachchan: రాజ్యసభ ఫేర్‌వెల్ ప్రసంగంలో క్షమాపణ చెప్పిన జయాబచ్చన్..ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనూ ఓరకంగా సంచలనమే సృష్టించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విసుర్లు విసిరారు. అయితే తన వీడ్కోలు ప్రసంగం (Farewell Speech)లో సభ్యులందరికీ క్షమాపణలు తెలిపారు. తనకు టక్కున కోపం (short temper) వచ్చేస్తుందని, ఎవరినీ గాయపరచే ఉద్దేశం మాత్రం ఉండదని అన్నారు.


''ఎందుకు మీకు కోపం వస్తుంటుందని జనం అడుగుతుంటారు. కోపం నాకు స్వభావ సిద్ధం. నన్ను నేను మార్చుకోలేను. నాకు ఏదైనా నచ్చనప్పుడో, ఇష్టం లేనప్పుడో సహనం కోల్పోతుంటాను. సభలోని సభ్యులు ఎవరిపైన అయినా తాను అలా ప్రవర్తించి ఉంటే వారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను'' అని బచ్చన్ వివరణ ఇచ్చారు.


వాళ్లేమీ స్కూళ్లు పిల్లలు కాదు...

రాజ్యసభ చైర్మన్ థన్‌ఖఢ్ గత మంగళవారంనాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నను విడిచిపెట్టి మరో ప్రశ్నను ముందుకు తీసుకురావడంతో కాంగ్రెస్ నేత ఒకరు నిలదీశారు. దీనిపై ధన్‌ఖఢ్ ఆయనను మందలించారు. దీంతో జయాబచ్చన్ జోక్యం చేసుకుంటూ, ఎందుకు అలా జరిగిందో చెబితే సభ్యులు అర్ధం చేసుకుంటారని, వాళ్లేమీ చిన్నపిల్లలు కాదని ధన్‌ఖఢ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తర్వాత కొద్దిసేపటికే వ్యవహారం చక్కబడింది.

Updated Date - 2024-02-09T15:52:45+05:30 IST