Share News

JK Assembly Elections: ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన 'ఆప్'

ABN , Publish Date - Aug 25 , 2024 | 07:59 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ అదివారంనాడు ప్రకటించింది. వీటిలో పుల్వామా, రాజ్‌పోరా, దేవ్‌సర్, దూరు, దోడా, దోడా వెస్ట్, బనిహాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

JK Assembly Elections: ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన 'ఆప్'

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jammu and Kashmir Assembly Elections) పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అదివారంనాడు ప్రకటించింది. వీటిలో పుల్వామా, రాజ్‌పోరా, దేవ్‌సర్, దూరు, దోడా, దోడా వెస్ట్, బనిహాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.


నియోజకవర్గాల వారీగా పుల్వామా నుంచి ఫయజ్ అహ్మద్ సోఫి, రాజ్‌పోరా నుంచి ముదసిర్ హసన్, దేవ్‌సర్ నుంచి షేక్ ఫిదా హుస్సేన్, దూరు నుంచి మొహిసిన్ షఫకత్ మీర్, దోడా నుంచి మెహ్‌రాజ్ దిన్ మాలిక్, దోడా వెస్ట్ నుంచి యాసిర్ షఫి మట్టూ, బనిహాల్ నుంచి ముదసిర్ అజ్మత్ మీర్‌ 'ఆప్' అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.

Prashant Kishor: 243 స్థానాల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ : పీకే


స్టార్ క్యాంపెయినర్లుగా కేజ్రీవాల్, సునీత, మాన్

కాగా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ఆప్ ప్రకటించిది. వారిలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పార్టీ నేతలు మనీష్ సిసోడియా, ఆప్ మంత్రులు అతిషి, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్, ఎంపీ రాఘవ్ చద్దా తదితరులు ఉన్నారు.


ఎన్నికల తేదీలివే..

జమ్మూకశ్మీర్‌లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 08:02 PM