J-K assembly polls: కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సీఈసీ భేటీ..!
ABN , Publish Date - Aug 13 , 2024 | 08:21 PM
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లాతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో భద్రత పరిస్థితులపై కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఈసీ సమావేశమై సమీక్షించనుంది.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 13: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లాతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో భద్రత పరిస్థితులపై కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఈసీ సమావేశమై సమీక్షించనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం గత వారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించింది.
Viral Video: ఈ వయస్సులో తాతగారి బుగ్గ బామ్మగారు ఎలా గిల్లిందో చూశారా..?
Also Read: Bangladesh Violence: పలువురు బంగ్లాదేశీయులు అరెస్ట్
ఈ సందర్బంగా చీఫ్ సెక్రటరీ అటల్ డుల్లోతోపాటు కేంద్ర పాలిత ప్రాంత పోలీస్ చీఫ్ ఆర్ ఆర్ స్వైన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అలాగే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రత్యేక బలగాలను మోహరిస్తామన్నారు. 2014 నాటి నుంచి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.
Also Read:New Delhi: మనీశ్ సిసోడియాతోపాటు అతిషికి రాఖీలు కట్టిన విద్యార్థులు
Also Read: Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్
Also Read: New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
అయితే ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై ప్రపంచంలోని పలు దేశాలు దృష్టిసారించాయి. అదీకాక.. 2024, సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు అమర్నాథ్ యాత్ర మరికొద్దిరోజుల్లో ముగియనుంది. దీంతో ఆ యాత్ర ముగియగానే.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగే అవకాశముందని ఓ చర్చ సైతం సాగుతుంది.
Also Read: Kolkata Doctor's Case: సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్‌కతా హైకోర్టు
Also Read: Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు
Read More National News and Latest Telugu News