Delhi: ఢిల్లీలో మాయమై.. వారణాసిలో ప్రత్యక్షమై.. దొరికిన జేపీ నడ్డా కారు..
ABN , Publish Date - Apr 07 , 2024 | 02:03 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కారు మార్చి 19న చోరీకి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలో చోరీకి గురైన కారు ఆదివారం వారణాసిలో ప్రత్యక్షమైంది. నడ్డా భార్య మళ్లికాకు చెందిన ఫార్చునర్ ఎస్‌యూవీ కారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోరీకి గురైంది.
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కారు మార్చి 19న చోరీకి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలో చోరీకి గురైన కారు ఆదివారం వారణాసిలో ప్రత్యక్షమైంది. నడ్డా భార్య మళ్లికాకు చెందిన ఫార్చునర్ ఎస్‌యూవీ కారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోరీకి గురైంది. డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి దాన్ని తీసుకొచ్చారు. కారు డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చారు. కారును వారణాసిలో గుర్తించిన పోలీసులు జేపీ నడ్డా వ్యక్తిగత సిబ్బందికి సమాచారం చేరవేశారు.
Trending News : భర్తకు విచిత్ర కోరిక.. పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకున్న భార్య..
దాన్ని ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడ్డా ఇంటికి వెళ్తున్న క్రమంలో మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచారు. ఆ సమయంలో దుండగులు కారును దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినపుడు కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. సుమారు 20 రోజుల తర్వాత దానిని వారణాసిలో పట్టుకున్నారు. హరియాణా రాష్ట్రం ఫరిదాబాద్ దగ్గర్లోని బద్కల్‌కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి ఆ కారును వారణాసికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బద్కల్ వాహన నంబర్ ప్లేట్‌ను మార్చి.. అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలీ, సీతాపూర్, లఖ్‌నవూ మీదుగా వారణాసికి వచ్చారని చెప్పారు. అక్కడి నుంచి దాన్ని నాగాలాండ్‌కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలిసింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని విచారించి.. కారును స్వాధీనపరుచుకున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి