Share News

Kanchanjungha Express collision: పలు రైల్వే సర్వీసులు రద్దు.. మరికోన్ని దారి మళ్లింపు

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:59 PM

పశ్చిమ బెంగాల్‌లో కాంచన్ జంఘా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద దుర్ఘటన న్యూజల్పాయిగూరి వద్ద చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో పలు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.

Kanchanjungha Express collision: పలు రైల్వే సర్వీసులు రద్దు.. మరికోన్ని దారి మళ్లింపు

పశ్చిమ బెంగాల్‌లో కాంచన్ జంఘా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాద దుర్ఘటన న్యూజల్పాయిగూరి వద్ద చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో పలు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. 19 రైళ్లను రద్దు చేశామని... మరో 9 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వివరించింది. అందులో దిబ్రుఘడ్-న్యూడిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్, హౌరా-న్యూజల్పాయిగూరి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయని తెలిపింది. అలాగే రద్దు చేసిన రైల్వే సర్వీసులను ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది. ఈ రోజు ఉదయం చోటు చేసుకున్న ఈ రైలు ప్రమాదంలో 15 మంది మరణించారు. 33 మందికిపైగా గాయపడ్డారు.

Also Read: Reasi Terror Attack: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం


Also Read: Assembly Elections: గెలుపు కోసం పావులు కదుపుతున్న బీజేపీ

మరోవైపు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకోవైపు ఈ ప్రమాద ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని సైతం ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం విధితమే.

Trains.jpg

Also Read: Read Latest National News and Telugu States News

Updated Date - Jun 17 , 2024 | 05:06 PM