బళ్లారి జైలుకు దర్శన్ భారీ భద్రత నడుమ తరలింపు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:07 AM
రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ను పోలీసులు గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తీసుకొచ్చారు.
బళ్లారి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ను పోలీసులు గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తీసుకొచ్చారు. జైలు సూపరింటెండెంట్ ఆయ న్ను తనిఖీ చేసి ఖైదీ నంబరు 511ను కేటాయించారు. రేణుకాస్వామి హత్య కే సులో ఏ-2 నిందితుడుగా ఉన్న దర్శన్.. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో విలాసవంతమైన జీవితం గడుపుతున్న విషయం ఫొటోలు, వీడియోల ద్వారా బయటకు వచ్చింది. దీంతో దర్శన్ సహా నిందితులను వేర్వేరు జైళ్లకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దర్శన్‌ను బెంగళూరు నుంచి ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా బళ్లారికి తీసుకొచ్చారు.