Home » Ballari
మాజీ మంత్రి, బీజేపీ నాయకులు బి. శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు రాజుల కాలం నాటి హరెమనె స్థలం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడంం సరి కాదని ఆయన పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గూళ్యం గ్రామంలో జరిగే గాదిలింగేశ్వర జోడు రథోత్సవ వేడుకలకు పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు యువకులు మృత్యు ఒడిలోకి చేరారు.
ఏవియస్ ఇన్‌ప్లూఎంజా (బర్డ్‌ప్లూ) అనేది పక్షుల్లో వైరస్ వల్లకలిగే వ్యాధి అని, ఇది అంటు వ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా(Collector Prashant Kumar Mishra) అన్నారు.
తీరప్రాంత జిల్లాల్లో మరో ఐదురోజులు వేడిగాలులతోపాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు కానున్నాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉత్తర కన్నడ జిల్లాను ఎల్లో అలర్ట్‌గా ప్రకటించింది.
నగరంలో ఓ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. బళ్లారి(Ballari) నగరంలోని గ్లాస్ బజార్లో నివాసం ఉండే శంకర్రావు (40) తన భార్య శాంతిదేవి(34)ని హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకని వెళ్ళి నదిలో కొట్టుకుని పోయిన హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు అనన్యరావు(26) మృత దేహాన్ని ఎట్టకేలకు గురువారం రక్షణ సిబ్బంది గుర్తించారు.
తుంగభద్ర(Tungabhadra) నుంచి హెచ్చెల్సీ ఆయకట్టులో సాగులో ఉన్న పంటలకు, ప్రజల తాగునీరు అవసరం నిమిత్తం 70 క్యూసెక్కుల నీరును బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు.
బళ్లారికి చెందిన బీజేపీ అగ్రనాయకులు గాలి జనార్దన్‌రెడ్డి, బీ శ్రీరాములు(Gali Janardhan Reddy, B Sriramulu) మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గత కొన్ని రోజులుగా జిల్లాలో వారు చర్చనీయాంశంగా మారారు.
ప్రాణ స్నేహితులమని చెప్పుకునే వారిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అందరూ అనుకునేవారు.. కానీ పరస్పరం బురద జల్లుకునే పరిస్థితి రావడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సాధారణంగా శత్రువులు పరిస్థితులకు అనుకూలంగా మిత్రులవుతారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆప్తుడని ముద్ర వేసుకున్న గాలి జనార్ధనరెడ్డిపైనే మాజీ మంత్రి శ్రీరాములు తీవ్రమైన ఆరోపణలు చేశారు.