Home » Darshan
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు.
రేణుకాస్వామి హత్యకేసులో ఏ-2 నిందితుగా ఉంటూ బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నడ హీరో దర్శన్(Hero Darshan) బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలను సాయంత్రం 5 గంటలకు న్యాయవాది జైలర్(Jailer)కు అందజేశారు. పరిశీలించిన ఆయన దర్శన్‌ను విడుదల చేశారు.
రేణుకాస్వామి(Renukaswamy) అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడుగా బళ్లారి జైల్లో ఉన్న కన్నడ సినీ హీరో దర్శన్(Kannada movie hero Darshan)కు మంగళవారం రాత్రి విమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్శన్ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు విమ్స్‌లో స్కానింగ్ పరీక్షలు చేశారు.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్(Actor Darshan), ఏ1 నిందితు రాలు పవిత్రగౌడల బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సోమవారం 57వ సీసీహెచ్ కోర్టు తీర్పును ప్రకటించింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్టు చేశారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీపపై చార్జ్‌షీట్ దాఖలయింది. రెండున్నర నెలలపాటు సాగిన కేసు మలుపులకు చార్జ్‌షీట్‌తో ఒక కొలిక్కి వచ్చింది.
నేర ప్రవృత్తితో దారుణాలకు పాల్పడినవారిని జైళ్లలోకి వేయడం సహజం. ఎంతటివారైనా అక్కడ కఠినమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. చేసిన తప్పునకు జైళ్లలో పశ్చాత్తాపం కలగాలనేది ముఖ్య ఉద్దేశ్యం. జైళ్ల శాఖలో కొందరి నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా జైళ్లు విలాసవంతమైన ప్రాంతాలుగా మారిపోతున్నాయి.
రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.
రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ను పోలీసులు గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తీసుకొచ్చారు.
ఏడాది కిందట శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. రెండోసారి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్‌కు వివాదాలు చుట్టుముడుతున్నాయి.
వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఆయనను బళ్లారి జైలుకు తరలిస్తున్నారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాలయంలో ఉన్న దర్శన్‌ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు మారుస్తున్నారు.