Share News

Kanwar Yatra 2024: కన్వర్ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:07 PM

శివ భక్తుల వార్షిక తీర్ధయాత్ర 'కన్వర్'లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హరిద్వార్‌కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు.

Kanwar Yatra 2024: కన్వర్ యాత్రకు భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా

హరిద్వార్: శ్రావణమాసంలో ప్రారంభమయ్యే శివ భక్తుల వార్షిక తీర్ధయాత్ర 'కన్వర్' (Kanwar) లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హరిద్వార్‌కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు.


డ్రోన్లు, సిసీటీవీలతో నిఘా

కన్వర్ యాత్ర ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుగు సాగేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్ తెలిపారు. యాత్రామార్గంలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని, సెంట్రల్ ఏజెన్సీ అధికారులు భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని చెప్పారు. భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, మత విశ్వాసాల దృష్ట్యా ఉత్తరాఖండ్ పోలీసులకు కన్వర్ యాత్ర కీలకమైన సవాలని, యాత్ర నిర్వహణ విజయవంతంగా నిర్వహించేందుకు పట్టుదలగా ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది యాత్రా తేదీలు ఖరారయ్యాయని, జూలై 22న ప్రారంభమై ఆగస్టు 2న ముగుస్తాయని చెప్పారు. జూలై 1న ఎనిమిది రాష్ట్రాల పోలీసు అధికారులతో అంతర్రాష్ట్ర సమావేశం జరిపినట్టు చెప్పారు. ఇందులో సెంట్రల్ ఏజెన్సీలు, సీఏపీఎఫ్ పాల్గొన్నాయని అన్నారు. ఈసారి నిఘా, క్రౌడ్ మేనేజిమెంట్, ట్రాఫిక్ మేనిజిమెంట్ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. గతంలో కూడా కన్వర్ యాత్రను విజయవంతంగా నిర్వహించిన అనుభవం తమ బలగాలకు ఉందని, ఇతర రాష్ట్రాల సహకారంతో ఈ యాత్రను విజయవంతం చేస్తామని చెప్పారు.

PM Modi: సైబర్ నేరాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక


రూ.3 కోట్లు మంజూరు చేసిన ఉత్తరాఖండ్ సర్కార్

కన్వర్ యాత్ర నిర్వహణ కోసం పుష్కర్ సింగ్ ధామి సారథ్యంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజరు చేసింది. కన్వర్ యాత్ర ఏర్పాట్ల కోసం వివిధ శాఖల విజ్ఞప్తి మేరకు ఈ నిధులు కేటాయించారు. యాత్ర ఏర్పాట్లకు సాధ్యమైనంత త్వరగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. ఈసారి కూడా శివభక్తులు (కన్వరియాలు) పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నందున ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 17 , 2024 | 03:07 PM