Home » Yatra
కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ..
దక్షిణ కశ్మీర్‌లోని పర్వతాల్లో భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ ఆలయాన్ని దర్శించుకునే యాత్రికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది గత సంవత్సరం రికార్డును బద్దలుకొడుతూ సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 29 రోజుల్లో 4.51 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొని అమర్నాథ్ గుహల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
కావడి యాత్ర ర్గంలోని హోటళ్లు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానులు, సిబ్బంది పేర్లు పెట్టాలంటూ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారంనాడు 'మధ్యంతర స్టే' ఇచ్చింది. విపక్షాలతో పాటు ఎన్డీయే కీలక భాగస్వామి జనతాదళ్ యూనైటెడ్ సైతం ఈ తీర్పును స్వాగతించింది.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
ఉత్తరప్రదేశ్‌లో కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో యాత్రికులకు బాగా తెలుసునని అన్నారు.
వార్షిక కన్వర్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ టౌన్ సథేరి గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఒక ట్రక్కు బోల్తాపడి సుమారు 10 మంది కన్వరియాలు గాయపడ్డారు.
ఏటా లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే 'కన్వర్ యాత్ర' రూటులో తినుబండారాలకు సంబంధించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు.
శివ భక్తుల వార్షిక తీర్ధయాత్ర 'కన్వర్'లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. జూలై 22న కన్వర్ యాత్ర ప్రారంభమై ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్, హరిద్వార్‌కు కాలినడకన చేరుకుని గంగా జలాలను సేకరించి తిరిగి తమ స్థానిక శివాలయాల్లో సమర్పిస్తారు.
ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతుండటం, ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గర్వాల్ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో చార్‌థామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గార్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.