Kejriwal: కేజ్రీవాల్ పీఎస్‌పై వేటు
ABN , Publish Date - Apr 12 , 2024 | 09:53 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్(Kejriwal)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ గురువారం డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్(Kejriwal)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ గురువారం డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. గతంలో ఆయన ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని, నియామకం సమయంలో ఆ విషయాన్ని వెల్లడించకుండా దాచిపెట్టారని ఆరోపించింది. ఈ మేరకు విజిలెన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజే రాజశేఖర్ ఆదేశాలు ఇచ్చారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్-1965లోని రూల్-5ను పాటించనందున తొలగింపు ఉత్తర్వులు ఇస్తున్న ట్టు తెలిపారు. కాగా, ఈడీ సోమవారమే బిభవ్‌ను, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను లిక్కర్ స్కామ్‌పై ప్రశ్నించింది. మరోవైపు మంగళవారం తిహాడ్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను బిభవ్‌కుమార్ కలిశారు.