Bomb Threat: బాంబు బెదిరింపుల కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ కోపంతోనే..
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:34 PM
ఇటీవల ఎయిర్ ఇండియా విమానానికి వచ్చిన బాంబు బెదిరింపుల కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు.. తాను ఆ ఫేక్ కాల్ ఎందుకు చేయాల్సి..
ఇటీవల ఎయిర్ ఇండియా (Air India) విమానానికి వచ్చిన బాంబు బెదిరింపుల (Bomb Threat) కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు.. తాను ఆ ఫేక్ కాల్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కారణాన్ని విచారణలో తెలిపాడు. తమ టికెట్‌ను రీషెడ్యూల్ చేయాలన్న కోపంతోనే తాను ఈ పని చేశానంటూ కుండబద్దలు కొట్టాడు. ఈ సమాధానం విని అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన AI 149 అనే విమానం కొచ్చి నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే.. అంతకుముందు రోజైన సోమవారం అర్థరాత్రి ముంబైలోని ఎయిర్ ఇండియా కస్టర్ కేర్ సెంటర్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ విమానంలో బాంబు పెట్టారని చెప్పి, అవతలి వ్యక్తి వెంటనే కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వెంటనే ఆ విమానంలో తనిఖీలు నిర్వహించారు. చివరికి ఎలాంటి పేలుడు సామాగ్రి లభించకపోవడంతో.. అదొక ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశాడు. ఆ నిందితుడి పేరు సుహైబ్ (30).
ఈ బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డావని ప్రశ్నించగా.. తమ టికెట్‌ని రీషెడ్యూల్ చేయకపోవడం వల్లేనని సుహైబ్ తెలిపాడు. తన భార్య, కుమార్తెతో కలిసి తాను మంగళవారం AI 149 విమానంలో లండన్‌కు వెళ్లాల్సి ఉందని.. కానీ కుమార్తె ఫుడ్ పాయిజనింగ్‌కు గురవ్వడంతో తమ ట్రిప్‌ని వాయిదా వేశామని చెప్పాడు. దీంతో తమ టికెట్‌ను మరో రోజు రీషెడ్యూల్ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను కోరామన్నాడు. కానీ.. ఎయిర్‌లైన్స్ అందుకు నిరాకరించిందని, దాంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని.. ఆ కోపంతోనే ఫేక్ బాంబు బెదిరింపులకు పాల్పడ్డానని సుహైబ్ వివరించాడు.
Read Latest National News and Telugu News