Air India Express Flight: యువకుడు హల్‌చల్: ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
ABN , Publish Date - Jun 03 , 2024 | 03:57 PM
విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.
ముంబై, జూన్ 03: విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేక్ ఆఫ్ అయింది. ఆ వెంటనే ప్రయాణికుడు అబ్దుల్ ముసావిర్ (25) విమానం వెనక్కి వెళ్లి.. ద్వారం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఈ విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది అతడి ప్రయత్నాన్ని వారించారు.
Also Read: AP Election Result: గీత దాటితే.. కఠిన చర్యలు
అనంతరం అతడిని తీసుకు వచ్చి.. తన సీట్లో కుర్చోబెట్టారు. అయితే అబ్దుల్ ముసావిర్.. విమాన సిబ్బందితోపాటు సహచర ప్రయాణికులపై మండిపడ్డాడు. దీంతో ఆందోళన చెందిన సదరు సిబ్బంది.. వెంటనే ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులతో చర్చించి.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత అబ్దుల్ ముసావిర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read: AP Election Result: గీత దాటితే.. కఠిన చర్యలు
Read Latest Telangana News and National News