Share News

మా థోరియాన్ని వాడుకొని విద్యుత్‌ ఇవ్వండి

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:24 AM

కేరళలో సమృద్ధిగా ఉన్న థోరియం నిక్షేపాలను సద్వినియోగం చేసుకొని తమ రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేయాలని కేంద్రమంత్రి మనోహర్‌ ఖట్టర్‌ను ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కృష్ణణ్‌కుట్టి కోరారు.

మా థోరియాన్ని వాడుకొని విద్యుత్‌ ఇవ్వండి

కేంద్రానికి కేరళ ప్రభుత్వం వినతి

తిరువనంతరపురం, డిసెంబరు 24: కేరళలో సమృద్ధిగా ఉన్న థోరియం నిక్షేపాలను సద్వినియోగం చేసుకొని తమ రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేయాలని కేంద్రమంత్రి మనోహర్‌ ఖట్టర్‌ను ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కృష్ణణ్‌కుట్టి కోరారు. తమ రాష్ట్రం విద్యుత్‌ లోటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఽథోరియం నిక్షేపాలను వాడుకుని వాటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను కేరళకు సరఫరా చేయాలని విన్నవించారు. ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో కేంద్రమంత్రికి కేరళ విద్యుత్‌ మంత్రి ఈ మేరకు విన్నవించినట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. దీనిపై మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్పందిస్తూ.. కేరళ విద్యుత్‌ లోటును ఎదుర్కొంటూ పక్క రాష్ట్రాల నుంచి కొంటున్న నేపథ్యంలో అక్కడే న్యూక్లియర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఉండదని సూచించినట్లు పేర్కొన్నాయి. దీనికోసం కేరళ ప్రభుత్వం భూమిని ఇస్తే న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలిపాయి.

Updated Date - Dec 25 , 2024 | 04:24 AM