Share News

Kolkata Case: కోల్‌కతా కేసు.. ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐల సస్పెన్షన్..

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:26 PM

న్యూఢిల్లీ: కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు.

Kolkata Case: కోల్‌కతా కేసు.. ఇద్దరు ఏసీపీలు,  ఎస్ఐల సస్పెన్షన్..

న్యూఢిల్లీ: కోల్‌కతా కేసు (Kolkata Case)లో డాక్టర్ల ఆందోళ (Doctors Protest) కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రి (Arjikar Hospital)పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు (ACP), ఎస్ఐలు (SI) సస్పెండ్ (Suspend) అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు. కోల్‌కతా మెడికో హత్యాచార ఘటనకు సంబంధించి డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన కొంతమందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.


కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచాలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఆందోళన కారులు 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లలో పాల్గొన్న మరికొంది కోసం సీసీటీవీ పూటేజీని పరిశీలిస్తున్నారు. ఈ విధ్వంస ఘటనను పోలీసులు నిలువరించలేకపోవడంతో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి.


వైద్యుల భద్రతకు టాస్క్ ఫోర్స్

ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం కేసును సుమోటోగా స్వీకరిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాస్క్‌ఫోర్స్‌లో హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌రెడ్డికి చోటు కల్పించింది. పని ప్రదేశాల్లో వైద్యులపై లైంగిక పరమైన హింసను నివారించేందుకు.. వైద్యులు, నర్సులకు భద్రత, గౌరవప్రదమైన పరిస్థితులు కల్పించడానికి జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్‌టీఎఫ్‌కు నిర్దేశించింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌, తన మధ్యంతర నివేదికను మూడు వారాల్లోగా.. పూర్తిస్థాయి నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది.


టాస్క్‌ఫోర్స్‌కు కేంద్ర క్యాబినెట్‌, హోంశాఖ, ఆరోగ్యశాఖ కార్యదర్శులు.. జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) చైర్‌పర్సన్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రెసిడెంట్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారని ధర్మానం పేర్కొంది. వైద్యులపై భౌతికదాడులు, లైంగిక హింసకు సంబంధించి వైద్యసంస్థలు తమకు తాము ఎలాంటి నిబంధనలను రూపొందించుకోకపోవడం తీవ్ర ఆందోళనకరం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైద్యుల భద్రత కోసం చట్టాలు ఉన్నాయని.. అయితే అవి వ్యవస్థాగత సమస్య (సిస్టమెటిక్‌ ఇష్యూస్)లను పరిష్కరించలేవు అని వ్యాఖ్యానించింది. పనిచేసే చోట వైద్యులకు భద్రతాలేమిపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందదుకు మరో అత్యాచారమో.. హత్యో జరిగేదాకా ఎదురుచూడకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్జీకర్‌ ఆస్పత్రిలో హత్యాచారం, హత్యకు గురైన జూనియర్‌ వైద్యురాలి పేర్లు, ఫొటోలు, వీడియోలను తక్షణమే సామాజిక మాధ్యమాల్లోంచి తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వైద్యులు.. ఆందోళనలను విరమించి, ఎప్పటిలాగే వైద్యసేవలు కొనసాగించాలని అప్పీలు చేసింది. వైద్యుల సమ్మెతో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. ‘‘వైద్యుల భద్రతపై భరోసా కల్పించేందుకు మేం ఉన్నాం.. ప్లీజ్‌ మమ్మల్ని నమ్మండి’’ అని వైద్యులను ఉద్దేశించి పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఢిల్లీలోని ఆర్‌ఎంల్‌ ఆస్పత్రి వైద్యులు తమ సమ్మెకు ముగింపు పలికారు. జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించడాన్ని రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ స్వాగతించింది. మరోవైపు.. ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపేందుకు స్వామి వివేకానంద స్టేట్‌ పోలీస్‌ అకాడమీ ఐజీ డాక్టర్‌ ప్రణవ్‌ కుమార్‌ సారత్యంలో నాలుగు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) బెంగాల్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం దృశ్యాలు..

ఆ నిధులు వైఎస్ జగన్ ఏం చేశారు..?

నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్

కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..

సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 21 , 2024 | 01:26 PM