Share News

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు

ABN , Publish Date - Aug 09 , 2024 | 09:45 AM

ఈ చిత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతోపాటు వారి కుటుంబ సభ్యులు.. అలాగే రిజిస్ట్రీ సిబ్బంది వీక్షించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు నిర్మాత ఆమిర్ ఖాన్‌తోపాటు దర్శకురాలు కిరణ్ రావ్ సైతం హజరుకానున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులు.. ఆమిర్ ఖాన్ దంపతులతో కలిసి మాట్లాడతారు.

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 09: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 75వ పడిలో అడుగుపెట్టి.. వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆడిటోరియంలో లాపతా లేడీస్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వానికి సంబంధించిన కథకథనంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు తెరకెక్కించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డిండ్ కాంప్లెక్స్‌, సీ బ్లాక్‌లోని ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం


ఈ చిత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతోపాటు వారి కుటుంబ సభ్యులు.. అలాగే రిజిస్ట్రీ సిబ్బంది వీక్షించనున్నారు. ఈ సినిమా ప్రదర్శనకు నిర్మాత ఆమిర్ ఖాన్‌తోపాటు దర్శకురాలు కిరణ్ రావ్ సైతం హజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం 4.15 గంటలకు ఈ చిత్రం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.20 గంటకు ఈ చిత్రం పూర్తవుతుంది. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులు.. ఆమిర్ ఖాన్ దంపతులతో కలిసి మాట్లాడతారు. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Also Read: wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?


లాపతా లేడీస్ అంటే తప్పిపోయిన స్త్రీలు అని అర్థం. మార్చి 1వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం సంచలన రికార్డులను నమోదు చేసుకుంది. తక్కవ బడ్జెట్‌తో అంటే.. జస్ట్ రూ. 4 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలై కలెక్షన్ల రూపంలో రూ. 20 కోట్లు సాధించింది. ఇక ఏప్రిల్‌లో ఓటీటీలో సైతం విడుదలై దూసుకు పోతుంది. యానిమల్ రికార్డును ఈ లాపతా లేడీస్ చిత్రం బద్దలు కొట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

s-court.jpg

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 09:51 AM