Share News

Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు

ABN , Publish Date - Sep 09 , 2024 | 02:00 PM

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైనాయి. ఊరు వాడా గణపతి విగ్రహాలు కొలువు తీరాయి. చిన్న పెద్దలంతా కలిసి గణపతి నవరాత్రులను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ముంబయిలోని ఓ వినాయకుడుకి భక్తులు విరాళాలు రూపంలో రూ. 50 లక్షలు సమర్పించుకున్నారు.

Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైనాయి. ఊరు వాడా గణపతి విగ్రహాలు కొలువు తీరాయి. చిన్న పెద్దలంతా కలిసి గణపతి నవరాత్రులను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ముంబయిలోని ఓ వినాయకుడుకి భక్తులు విరాళాలు రూపంలో రూ. 50 లక్షలు సమర్పించుకున్నారు. అదీ కూడా తొలి రోజు కావడం విశేషం. మధ్య ముంబయిలోని లాల్‌బాగ్చ రాజా సర్వజనిక్ గణేశ్ ఉత్సవ్ మండల్ ఏర్పాటు చేసిన ఈ గణనాధుడుకి ఈ స్థాయిలో విరాళాల రూపంలో రావడం రికార్డు అని నిర్వాహాకులు తెలిపారు.


స్వామి వారి మెడలో కరెన్సీ నోట్ల దండలుగా వేసినవే అధికంగా ఉన్నాయని వారు వివరించారు. వినాయకుడిని వచ్చిన నగదు లెక్కింపునకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ గణనాధుడిని ప్రతీ రోజు 1.5 మిలియన్ల మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పారు. 1934 నుంచి నవరాత్రుల సందర్భంగా ఇలా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది 91వ వసంతంలోకి అడుగు పెట్టామన్నారు. అయితే కోవిడ్ సమయంలో మాత్రం వినాయక నవరాత్రులు నిర్వహించలేదని నిర్వాహాకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.


ఇక ఇదే ప్రాంతంలో చింక్‌పోక్లి చా చింతామణి‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపానికి సైతం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారన్న విషయం విధితమే. ముంబయి మహానగరంలో ప్రముఖ గణపతి మండపాలు చాలానే ఉన్నా.. లాల్ ‌బాగ్చ రాజా, చింక్‌పోక్లి చా చింతామణి మండపాలకు మాత్రం ప్రతీ ఏడాది భక్తులు పోటెత్తుతారని విషయం అందరికీ తెలిసిందే.


ముంబయి మహానగరంలో ప్రతి ఏడాది గణపతి నవరాత్రుల సందర్భంగా లాల్‌బాగ్చ రాజా సర్వజనిక్ గణేశుడిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దర్శించుకుంటారు. ఈ సందర్బంగా వారంతా గణనాధుని దర్శించుకుని.. మొక్కులు సైతం చెల్లించుకుంటారు.ఈ ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 5.00 గంటలకు స్వామి వారి దర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 11.00 గంటలకు గణపతి దర్శనాన్ని నిర్వాహాకులు నిలిపి వేస్తారు.


మరోవైపు లాల్ బాగ్చ రాజా వినాయకుడిని దర్శించుకొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు భారీగా ముంబాయికి తరలి వస్తారు. కానీ ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలు కారణంగా.. రవాణ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారయింది. అలాంటి వేళ.. ఈ వినాయకుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకొనే అవకాశాన్ని ఈ లాల్‌బాగ్చ రాజా సర్వజనిక్ గణేశుడి మండపం నిర్వహాకులు కల్పించారు. అందుకు వెబ్ సైట్, వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీక్షించవచ్చని తెలిపారు. అలాగే ప్రసాదాన్ని సైతం ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చిన భక్తులకు నిర్వాహాకులు సూచించారు.


YouTube ఛానెల్: https://youtube.com/live/yHXkf0cygm8?feature=share

ఫేస్బుక్ పేజీ: https://m.facebook.com/LalbaugchaRaja

Instagram ఖాతా: https://instagram.com/lalbaugcharaja

ట్విట్టర్ ఖాతా: https://twitter.com/lalbaugcharaja

వెబ్‌సైట్: https://www.lalbaugcharaja.com

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 09 , 2024 | 02:06 PM