Share News

Leopard: వామ్మో.. చిరుత ఎంత దర్జాగా తిరుగుతోందో..

ABN , Publish Date - Dec 18 , 2024 | 10:28 AM

ప్రభుత్వ కళాశాల రోడ్డులో చిరుతపులి(Leopard) సంచరించే సీసీ టీవీ దృశ్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాల్పారై, చుట్టుపక్కల గ్రామాల్లో కొద్దిరోజులుగా వన్యమృగాల సంచారం అధికమవుతోంది.

Leopard: వామ్మో.. చిరుత ఎంత దర్జాగా తిరుగుతోందో..

- కళాశాల రోడ్డులో చిరుత సంచారం

చెన్నై: కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా వాల్పారై ప్రభుత్వ కళాశాల రోడ్డులో చిరుతపులి(Leopard) సంచరించే సీసీ టీవీ దృశ్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాల్పారై, చుట్టుపక్కల గ్రామాల్లో కొద్దిరోజులుగా వన్యమృగాల సంచారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో, మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కళాశాల రోడ్డులో చిరుత సంచరించింది.

ఈ వార్తను కూడా చదవండి: Trains: సూళ్లూరుపేట, నెల్లూరు మెము రైళ్ల వేళల్లో మార్పులు


nani3.jpg

ఈ సమయంలో ఆ ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లిన కొందరు, చిరుతను చూసి భయాందోళనకు గురై సమీపంలోని దుకాణాలపై ఎక్కి తప్పించుకున్నారు. వారిలో కొందరు చిరుత సంచరించే దృశ్యాలు సెల్‌ఫోన్‌(Cellphone)లో చిత్రీకరించి సోషల్‌ మీడియా(Social media)లో పోస్ట్‌ చేశారు. అలాగే, ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో కూడా చిరుత సంచారం దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం

ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 18 , 2024 | 10:28 AM