Share News

LokSabha Elections: రేపే నాలుగో దశ పోలింగ్..

ABN , Publish Date - May 12 , 2024 | 04:21 PM

నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), బిహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్ ఒక సీటుకు పోలింగ్ జరగనుంది.

LokSabha Elections: రేపే నాలుగో దశ పోలింగ్..

హైదరాబాద్, మే 12: నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు జరగనున్న ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), బిహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్ ఒక సీటుకు పోలింగ్ జరగనుంది.


అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు ఒడిశా అసెంబ్లీకి సైతం 4 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 1వ తేదీన జరిగే నాలుగో దశ పోలింగ్‌తో.. ఒడిశా అసెంబ్లీకి పోలింగ్ ముగియనుంది.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి మాధవిలత, అసదుద్దీన్ ఓవైసీ, కరీంనగర్ నుంచి బండి సంజయ్, బిహార్‌లోని బిగుసరాయి నుంచి గిరిరాజ్ సింగ్, కడప నుంచి వైయస్ షర్మిల, జార్ఖండ్‌లోని ఖుంతి నుంచి అర్జున్ ముండా, బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి శతృఘ్నసిన్హా, బెహరంపూర్ నుంచి యూసఫ్ పఠాన్, అధిర్ రంజన్ చౌదరి, రాజంపేట నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఎన్నికల బరిలో నిలిచారు.


దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇప్పటి వరకు మూడు దశలో.. మొత్తం 285 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. రేపు నాలుగో దశ పోలింగ్ జరుగుతుంది. ఇంకా మూడు దశలు మే 20, మే 25, జూన్ 1వ తేదీన జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుందీ. అదే రోజు.. దేశంలోని ఓటరు ఏ పార్టీకి అధికారం కట్టబెడతాడనే విషయం స్పష్టం కానుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం అదే రోజు లెక్కించనున్నారు. దీంతో ఆ యా రాష్ట్రాల్లోని ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది సుస్పష్టం కానుంది.

Read Latest National News And Telugu News

Updated Date - May 12 , 2024 | 04:25 PM