Share News

Lok Sabha Elections 2024: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు

ABN , Publish Date - May 30 , 2024 | 01:28 PM

ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల సంఖ్య బాగా పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఇది గతంలో కంటే ప్రస్తుతం.. ఈ పదిహేనేళ్లలో.. అంటే 2009 నుంచి 2024 వరకు 104 శాతం మేర పెరిగిందని పేర్కొంది.

Lok Sabha Elections 2024: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు

న్యూఢిల్లీ, మే 30: ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల సంఖ్య బాగా పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఇది గతంలో కంటే ప్రస్తుతం.. ఈ పదిహేనేళ్లలో.. అంటే 2009 నుంచి 2024 వరకు 104 శాతం మేర పెరిగిందని పేర్కొంది. 2024లో జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 751 రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయని వివరించింది. అయితే 2009లో 368, 2014లో 454, 2019లో 677 రాజకీయ పార్టీలు.. ఆ యా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాయని ఈ సందర్భంగా ఏడీఆర్ గుర్తు చేసింది.

Also Read: చార్మినార్ ముందు బీఆర్ఎస్ ధర్నా.. హైదరాబాద్‌లో హైటెన్షన్


ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపింది. అందులో జాతీయ పార్టీలకు చెందిన వారు 1,333 మంది ఉన్నారని.. రాష్ట్రాల్లోని పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలకు చెందిన వారు 532 మంది ఉన్నారని చెప్పింది. ఇక రిజిస్టర్ కానీ పార్టీల నుంచి 2,580 మంది, స్వతంత్ర్య అభ్యర్థులు 3,915 మంది ఎన్నికల బరిలో నిలిచారని ఏడీఆర్ విశదీకరించింది.

Also Read: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!


ఇక జాతీయ పార్టీల నుంచి బరిలో దిగిన మొత్తం అభ్యర్థుల్లో 443 మందిపై క్రిమినల్ కేసులు నమోదు కాగా.. మరో 295 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారంది. అలాగే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో 249 మందిపై క్రమినల్ కేసులు ఉండగా.. మరో 169 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని పేర్కొంది. గుర్తింపు పొందని పార్టీల నుంచి బరిలో దిగిన వారిలో 249 మందిపై క్రిమినల్ కేసులు ఉంటే.. మరో 316 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. స్వతంత్ర్య అభ్యర్థులుగా బరిలో దిగిన మొత్తం అభ్యర్థుల్లో 550 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయితే.. 316 మందిపై తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ వివరించింది. మరోవైపు జాతీయ పార్టీల నుంచి స్వతంత్ర్య అభ్యర్థులుగా బరిలో దిగిన మొత్తం అభ్యర్తుల్లో కోటీశ్వరులు వేలల్లో ఉన్నారని ఏడీఆర్ స్పష్టం చేసింది.

Also Read: ఐఏఎస్‌ రోహిణి సింధూరి వేతనంలో కోత విధించండి...

For Latest News and National News click here..

Updated Date - May 30 , 2024 | 01:39 PM