Home » ADR Report
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు.. మనం ఎన్నుకుని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి.
కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం లోక్సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్సభలో క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల సంఖ్య బాగా పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఇది గతంలో కంటే ప్రస్తుతం.. ఈ పదిహేనేళ్లలో.. అంటే 2009 నుంచి 2024 వరకు 104 శాతం మేర పెరిగిందని పేర్కొంది.
ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. 2009 నుండి 2024 వరకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విశ్లేషించింది.
లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) పోటీ చేస్తున్న దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులుగా ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకు చదివారు.
రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో(Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల డేటాను విశ్లేషించిన ఏడీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602గా ఉన్నాయని తెలిపింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి(BJP) 2022-23 సంవత్సరానికిగానూ అత్యధిక విరాళాలు సమకూరాయి. రెండో స్థానంలో తెలంగాణకు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్(BRS) ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక ప్రకారం.. బీజేపీకి 2022-23లో అత్యధికంగా విరాళాలు వచ్చాయి.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంచలన నివేదిక వెలువరించింది. కేసుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్ 1 అని, ఆయనపై అందరికన్నా అత్యధికంగా 64 కేసులు నమోదయ్యాయని, సీరియస్ ఐపీఎస్ సెక్షన్లు 37 నమోదు కాగా, ఇతర సెక్షన్లు 283 నమోదయ్యాయని ఏడీఆర్ పేర్కొంది.
దేశంలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత డేటాను జనాల ముందుంచే ఏడీఆర్ (Association for Democratic Reforms) తాజాగా మరో రిపోర్ట్ విడుదల చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ ఏకంగా రూ.1,400 కోట్ల ఆస్తితో దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత వరుస రెండు స్థానాల్లో కూడా కర్ణాటకకు చెందినవారే కావడం విశేషం.