Lok Sabha Elections: నేటితో ప్రచారానికి తెర.. ఎల్లుండే మూడో దశ పోలింగ్
ABN , Publish Date - May 05 , 2024 | 03:25 PM
సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఆ క్రమంలో మూడో దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది.
న్యూఢిల్లీ, మే 05: సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఆ క్రమంలో మూడో దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఈ దశలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,351 మంది అభ్యర్థులు బరిలో దిగారు.
PrajaGalam: ధర్మవరం వేదికగా పోలవరంపై అమిత్ షా కీలక ప్రకటన
ఈ దశలో బరిలో నిలిచిన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా (గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), బీజేపీ తిరుగుబాటు నాయకుడు కే.ఎస్. ఈశ్వరప్ప(షిమోగా), డింపుల్ యాదవ్ (మెయిన్‌పురి), శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ), సుప్రియా సులే (బారమతి) తదితరులు ఉన్నారు.
Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్
అలాగే ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సమాజవాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోరు జరగనుంది. మరోవైపు ఇప్పటికే ఏప్రిల్ 19వ తేదీన తొలి దశ పోలింగ్ .. ఇక ఏప్రిల్ 29వ తేదీన రెండో దశ పోలింగ్ పూర్తి అయినాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీ ఉదయం ప్రారంభంకానుంది.
For Latest News and National News click here