Share News

Lok Sabha Elections 2024: గెలిచిన ముస్లిం అభ్యర్థులు ఎందరు, ఏ పార్టీ నుంచంటే?

ABN , Publish Date - Jun 05 , 2024 | 07:57 AM

ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.

Lok Sabha Elections 2024: గెలిచిన ముస్లిం అభ్యర్థులు ఎందరు, ఏ పార్టీ నుంచంటే?

ఢిల్లీ: లోక్ సభ సమరం ముగిసింది. అధికార బీజేపీకి మిత్ర పక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని నిలుపుకోవడం సాధ్యపడట్లేదు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమికి తలదన్నెలా సీట్లను సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో TMC అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. బహరంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పఠాన్ విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో 78 మంది ముస్లిం అభ్యర్థులు లోక్ సభ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన 115 మంది పోటీ చేశారు. ముస్లిం అభ్యర్థుల సంఖ్య తగ్గినప్పటికీ గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. సహారన్‌పూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ మసూద్‌ 64,542 ఓట్ల తేడాతో గెలుపొందారు. కైరానాలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఇక్రా చౌదరి 69,116 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌పై విజయం సాధించారు. ఘాజీపూర్ నుంచి అఫ్జల్ అన్సారీ 5.3 లక్షల ఓట్లతో సీటు నిలబెట్టుకున్నారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్‌లో బీజేపీకి చెందిన మాధవి లతపై 3,38,087 ఓట్ల తేడాతో గెలుపొందారు.


స్వతంత్ర అభ్యర్థులు విజయాలు

లడఖ్‌లో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ హనీఫా 27,862 ఓట్లతో గెలుపొందారు. మరో ఇండిపెండెంట్ అబ్దుల్ రషీద్ షేక్ జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానాన్ని 4.7 లక్షల మెజారిటీతో గెలుచుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో..

రాంపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మొహిబుల్లా 4,81,503 ఓట్లతో గెలుపొందగా, జియా ఉర్ రెహ్మాన్ 1.2 లక్షల ఓట్ల తేడాతో సంభాల్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో..

నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మియాన్ అల్తాఫ్ అహ్మద్ అనంతనాగ్-రాజౌరీ స్థానాన్ని 2,81,794 ఓట్లతో గెలుపొందారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఓడించారు. శ్రీనగర్‌లో ఎన్‌సీ అభ్యర్థి అగా సయ్యద్ రుహుల్లా మెహదీకి 3,56,866 ఓట్లు వచ్చాయి.

బహరంపూర్‌లో..

పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో తొలిసారిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత యూసఫ్ పఠాన్.. అధీర్ రంజన్ చౌదరిపై 85,022 ఓట్ల తేడాతో గెలుపొందారు.

NDA: ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న నితీష్.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు!

Updated Date - Jun 05 , 2024 | 07:57 AM