Home » Samajwadi Party
రాణా సంగాపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ మధ్యప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కర్ణిసేన సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీ ముఖానికి నల్లరంగు పూసి, చెప్పులతో కొట్టిన వ్యక్తికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని కూడా కర్ణిసేన రాష్ట్ర విభాగం ప్రకటించింది.
ఛత్రపతి శివాజీ మహరాజ్, సంభాజీ మహరాజ్ గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ తాను ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని, అయినప్పటికీ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వాటిని వెనక్కి తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానని అబూ అజ్మీ తెలిపారు.
సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న అబు అజ్మి తాజాగా ఔరంగజేబ్‌ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని కితాబిచ్చారు.
గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన దళిత మహిళ ఆ గ్రామానికి 500 మీటర్ల దూరంలోని ఒక కాలువలో మృతదేహంగా శనివారం ఉదయం కనిపించింది. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై పలు చోట్ల లోతైన గాయాలు, ఫ్రాక్చర్లు ఉన్నాయని, కళ్లు తీసేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుసగా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక ఆప్ పాలనకు గండి కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.
సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, కానీ కొన్ని సార్లు ఆ పార్టీ రాష్ట్ర విభాగం మాత్రం బీజేపీ బీ టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆదిత్య థాకరే తప్పు పట్టారు.
మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఎంవీఏ 30 సీట్లు గెలుచుకోగా, నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 స్థానాలకు కేవలం 49 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఎస్సీ అధినేత్రి మాయావతి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఎక్స్‌లో రాహుల్ గాంధీ టార్గెట్‌గా..
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.