Loksabha Speaker Election: ఇండియాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 25 , 2024 | 06:15 PM
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అలాంటి వేళ ఇండియా కూటమిలో చీలిక వచ్చిందా? అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తుంది.
న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అలాంటి వేళ ఇండియా కూటమిలో చీలిక వచ్చిందా? అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తుంది. ఇండియా కూటమి నుంచి స్పీకర్ అభ్యర్థిగా ఎంపీ కె. సురేశ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. అయితే కె. సురేశ్‌ను ఎంపిక చేసి.. బరిలో నిలిపే అంశాన్ని కూటమిలోని ఏ ఒక్కరు తమను సంప్రదించడం కానీ.. తమతో చర్చించడం కానీ చేయలేదన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయమని వ్యాఖ్యానించారు.
Also Read: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు
మరోవైపు బుధవారం స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ రోజు రాత్రి 8.00 గంటలకు ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి తాము హాజరుకావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయాన్ని పార్లమెంట్ వద్ద మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ మంగళవారం పేర్కొన్నారు. ఇక లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లా కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు 10 సెట్ల నామినేషన్లు వేశాయి. అలాగే కె.సురేశ్ తరఫున కేవలం 3 సెట్ల నామినేషన్లు ఇండియా కూటమి వేసింది.
Also Read: Telangana: లోక్‌సభలో ప్రమాణం చేసిన తెలంగాణ ఎంపీలు
Also Read: అమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి అతిషి
Also Read: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
Also Read: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్
Also Read: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట
For Latest News and National News click here