Home » Lok Sabha
జమిలి ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టేందుకు నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జరిగింది. ఈ రెండు బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపనున్నారు.
'ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు'ను డిసెంబర్ 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ఆలోచన చరిత్రాత్మకమని ప్రభుత్వం చెబుతోంది. పార్లమెంటు నుంచి స్థానిక సంస్థల వరకూ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని అంటోంది.
ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం పదేపదే రాజ్యాంగ సిద్ధాంతాలను బలహీనపరుస్తూ వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలు, వారి మాటలు అందులో కనిపిస్తాయని రాహుల్ అన్నారు. మన రాజ్యాంగం ఆలోచనల సమాహారమని, జీవిత తత్వశాస్త్రం, మన సంస్కృతికి సంబంధించిన ఆలోచనలో రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయని చెప్పారు.
భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.
జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. లోక్సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వేలను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వ ఎజెండాలో లేదని వివరించారు. బిల్లు సవరణతో రైల్వేలు ప్రైవేటుపరం అవుతాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలు పెరుగుదల, ప్రతినిధులకు బెదిరింపులపై చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నోటీసులు ఇచ్చారు. అలాగే సంభాల్ నుంచి రత్లాం వరకు పెరుగుతోన్న మత హింసపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ఘరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలని నోటీసులు ఇచ్చారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ముందు వరుసను కేటాయించారు.