Madapur village : ధనిక గ్రామం
ABN , Publish Date - Aug 25 , 2024 | 02:44 AM
పల్లెటూరంటే అందరికీ మట్టి రోడ్లు, పంట పొలాలు, పూరి గుడిసెలు, పేద ప్రజలు గుర్తుకు వస్తారు. కానీ, గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో ఉన్న మాదాపూర్ గ్రామం అలా కాదు.
ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామంగా
గ్రామంగా గుజరాత్‌లోని మాదాపూర్
ఆ ఊరి ప్రజల పేరు మీద రూ.7వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 24: పల్లెటూరంటే అందరికీ మట్టి రోడ్లు, పంట పొలాలు, పూరి గుడిసెలు, పేద ప్రజలు గుర్తుకు వస్తారు. కానీ, గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో ఉన్న మాదాపూర్ గ్రామం అలా కాదు. ఆ ఊరి ప్రజల పేరు మీద బ్యాంకుల్లో రూ.7వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.
అందుకే అది ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక గ్రామంగా రికార్డులకెక్కింది. ఈ ఒక్క ఊర్లోనే 17 బ్యాంకులు ఉన్నాయి. మాదాపూర్ గ్రామ జనాభా 32వేలకు పైనే. కానీ, వీరిలో సగం కంటే ఎక్కువ(65%) మంది ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాల్లోనే ఉన్నారు. అక్కడ పని చేస్తూ.. ఆ డబ్బును గ్రామంలో ఉన్న తమ కుటుంబసభ్యుల కోసం స్థానిక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.