Share News

Madhya Pradesh: బాణసంచ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం, 65కు పైగా క్షతగాత్రులు

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:12 PM

బాణసంచ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం, 65కు పైగా క్షతగాత్రులు హర్దా: మధ్యప్రదేశ్‌ లోని హర్దా టౌన్‌‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 65 మంది వరకూ గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.

Madhya Pradesh: బాణసంచ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం, 65కు పైగా క్షతగాత్రులు

హర్దా: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని హర్దా టౌన్‌ (Harda Town) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణసంచ ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించి ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 65 మంది వరకూ గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక శకటాలు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారుయి. మంటలు చుట్టుపక్కల ఉన్న భవనాలకు కూడా విస్తరించడంతో పలువురు పరుగులు తీయగా, మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.


తక్షణ చర్యలకు సీఎం ఆదేశం...

హార్దా టౌన్‌లో ఘోర విషాదం చోటుచేసుకోవడం ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, ఐపీఎస్ అజిత్ కేసరి, హోం గార్డ్ డీజీపీ అరవింద్‌ కుమార్‌ను ఆదేశించారు. క్షతగాత్రుల తక్షణ చికిత్సకు భోపాల్, ఇండోర్‌లోని మెడికల్ కాలేజీలు, భోపాల్ ఏఐఐఎంఎస్ బర్న్ యూనిట్‌కు అదేశాలిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించనున్నారు. కాగా, హార్దా జిల్లా ఆసుపత్రిలో 65 మంది వరకూ చేరారని, మరో 10 మందిని వేరే ఆసుపత్రికి పంపామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 06 , 2024 | 03:19 PM