Viral Video: ప్రియురాలితో జాలీ రైడ్.. మార్గమధ్యంలో అడుగుపెట్టిన భార్య ఏం చేసిందంటే?
ABN , Publish Date - Nov 17 , 2024 | 08:52 AM
భర్తపై అనుమానం వచ్చిన భార్య.. అతడి కదలికలపై నిఘా పెట్టింది. ప్రియురాలితో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లిన అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. తర్వాత ఏం చేసిందంటే...
Viral Video: భర్త ఎన్ని తప్పులు చేసినా భార్య క్షమిస్తుంది. అదే పరాయి స్త్రీతో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ క్షమించదు. ప్రధానంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తుండడం సోషల్ మీడియాలో తరుచూ చూస్తునే ఉన్నాం. ప్రియురాలితో ఉండగా భార్యకు దొరికిపోయిన భర్తలు.. ప్రియుడితో ఉంటూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతున్న భార్యల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రియురాలితో కలిసి కారులో జాలీ రైడ్ చేస్తున్న తన భర్తను మార్గమధ్యలో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని..
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ జీతేందర్ ఇంట్లో భార్య ఉన్నప్పటికీ.. మరో ప్రియురాలితో కలిసి కారులో సరదాగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. భర్త కదలికలపై ఓ కన్నేసి ఉంచిన భార్య.. ప్రేయురాలితో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లిన అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. జీతేందర్ ప్రియురాలిని కారులోంచి బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టింది.
సోషల్ మీడియాలో వైరల్..
కారులో వెళ్తున్న వారిని చూసి భార్య తన కోపం కట్టలు తెంచుకుని రోడ్డుపై కేకలు వేయడంతో స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నిముచ్ జిల్లా సావాన్ గ్రామంలో చోటుచేసుకుంది. తనను కొట్టిన గ్రామ పంచాయతీ చైర్మన్ భార్యపై అతని ప్రియురాలు ఉజ్జయిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా లక్షలాది మంది వీక్షించారు. రకరకాలుగా తమాషా కామెంట్లు కూడా చేస్తున్నారు.