Ujjain Mahakal Temple: ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరీగోడ కూలి ఇద్దరు మృతి
ABN , Publish Date - Sep 27 , 2024 | 09:40 PM
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయ ప్రహరిగోడ కుప్పకూలిన దుర్ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయ (Ujjain Mahakal Temple) ప్రహరిగోడ కుప్పకూలిన దుర్ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమాస్తుండటంతో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. వర్షాల కారణంగా ప్రహరీగోడ కుప్పకూలిందని అధికారులు తెలిపారు.
కాగా, క్షతగాత్రుల్లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి చికిత్స అందిస్తు్న్నట్టు చీఫ్ మెడికల్ అధికారి అశోక్ పటేల్ తెలిపారు. క్షతగ్రాతులు పెరిగినప్పటికీ చికిత్స అందించేందుకు మెడికల్ టీమ్‌ను సిద్ధం చేసినట్టు చెప్పారు.
Nitin Gadkari: ఇప్పుడు నడుస్తున్నదంతా పవర్ పాలిటిక్సే.. గడ్కరి చురకలు
మాజీ సీఎం సంతాపం
మహాకాల్ ఆలయ ప్రహరీగోడ కుప్పకూలిన దుర్ఘటనపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. మహాకాల్ టెంపుల్ గేట్ నెంబర్-4 వద్ద ఈ ఘటన జరిగిందని, ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారని ఆయన తెలిపారు. క్షతగ్రాతులు త్వరిగతిని కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Read More National News and Latest Telugu News
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి