Share News

Viral: టెకీ దారుణం! బాస్‌తో గడపాలంటూ భార్యపై ఒత్తిడి! ఆమె ఒప్పుకోలేదని..

ABN , Publish Date - Dec 24 , 2024 | 10:28 AM

మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్టీలో బాస్‌తో గడిపేందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఓ టెకీ ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు.

Viral: టెకీ దారుణం! బాస్‌తో గడపాలంటూ భార్యపై ఒత్తిడి! ఆమె ఒప్పుకోలేదని..

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్టీలో బాస్‌తో గడిపేందుకు తన భార్య ఒప్పుకోకపోవడంతో ఓ టెకీ ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. దీంతో, అతడిపై భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శంభాజీనగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది (Maharashtra).

Himachal Pradesh: భారీగా కురిసిన మంచు.. చిక్కుకున్న వెయ్యి వాహనాలు, పర్యాటకులు


జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిందితుడికి 45 ఏళ్లు కాగా అతడి భార్య వయసు 28. ఈ ఏడాది జనవరిలోనే వారికి వివాహమైంది. ఆ తరువాత కొద్ది నెలలు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. ఆ తరువాత నుంచి అతడు భార్యను పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించసాగాడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు రూ.15 లక్షలు తేవాలని కోరాడు. ఇదిలా ఉంటే..డిసెంబర్ 19న అతడు భార్యతో పాటు ఓ పార్టీకి హాజరయ్యాడు.

NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం

పార్టీలో బాస్‌తో గడపాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె తిరస్కరించింది. ఆ తరువాత ఆమెకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పుట్టింటి నుంచి మరిన్ని డబ్బులు తేవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె మళ్లీ నిరాకరించడంతో అతడు చివరకు ఆమె ట్రిపుల్ తలాక్ ఇచ్చేశాడు. దీంతో, బాధితురాలు శంభాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 115(2), 351(2), 351(3), 352 కింద కేసు నమోదైంది. బాస్‌తో గడపనందుకు భర్త తనపై చేయి చేసుకున్నట్టు కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన తరువాత తనను ఇంట్లోంచి గెంటేసినట్టు కూడా వెల్లడించింది.


Rains: మళ్ళీ అల్పపీడనం.. మరో 5 రోజులు వర్షసూచన

ట్రిపుల్ తలాక్‌ను భారత ప్రభుత్వం 2019లో నిషేధించిన విషయం తెలిసిందే. ఈ తరహా విడాకులు రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు 2017లో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అనంతరం, 2019లో ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు చట్టం చేసింది. 2019 ఆగస్టు 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ తరహా ఉదంతాలు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి,.

Justice Ram Subramanian : మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ రామసుబ్రమణియన్‌

Read Latest and National News

Updated Date - Dec 24 , 2024 | 10:38 AM