Boat Capasises: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
ABN , Publish Date - Sep 22 , 2024 | 05:24 PM
రెండు డజన్ల మందికి పైగా భక్తులు నీటిలో పడటంతో ఒక్కసారిగా అందరూ అందోళనకు గురయ్యరు. ఈత తెలిసిన కొందరు ఒడ్డుకు చేరుకోగా, తక్కిన వారిని సమీపంలోని పడవల్లో ఉన్న వారు సురక్షితంగా బయటకు తెచ్చారు.
ముంబై: గణేష్ నిమజ్జనంలో భారీ విషాదం తృటిలో తప్పింది. ముంబైలోని అంథేరి ఛా రాజా విగ్రహాన్ని వెర్సోవా బీచ్‌లో నిమజ్జనం చేసేందుకు భక్తులతో వెళ్తున్న పడవ ఊహించని విధంగా నీటమునిగిన సంఘటన ఆదివారంనాడు మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో జరిగింది. రెండు డజన్ల మందికి పైగా భక్తులు నీటిలో పడటంతో ఒక్కసారిగా అందరూ అందోళనకు గురయ్యరు. ఈత తెలిసిన కొందరు ఒడ్డుకు చేరుకోగా, తక్కిన వారిని సమీపంలోని పడవల్లో ఉన్న వారు సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో పెను విషాదం తప్పింది. ఒక భక్తుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Rail Track: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం
థానేలో రాళ్లు రువ్వుడు ఘటన
కాగా, థానేలో గణేష్ నిమజ్జనం ఉరేగింపుపై రాళ్లు రువ్విన ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వంజరి పట్టి నాక ప్రాంతంలో ఈనెల 18న ఈ ఘటన జరిగింది. అగతంకులు విసిరిన రాళ్లకు గణేష్ విగ్రహం దెబ్బతినడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మాంసం దుకాణం మీదుగా ఊరేగింపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని విశ్వహిందూ పరిషత్ కార్యాలయం ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
For More National News And Telugu News...
Narendra Modi: గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన