Share News

Viral News: రీల్ వీడియో రూపొందించండి.. రూ. 1.5 లక్షల బహుమతి గెల్చుకోండి..

ABN , Publish Date - Nov 15 , 2024 | 07:25 AM

మీకు షార్ట్ వీడియోలను తీసే టాలెంట్ ఉందా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే వినూత్నంగా ఓ వీడియో తీస్తే మీరు రూ.1.5 లక్షలు గెల్చుకునే అవకాశం ఉంది. అయితే దీనికోసం ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: రీల్ వీడియో రూపొందించండి.. రూ. 1.5 లక్షల బహుమతి గెల్చుకోండి..
reels video competition

మీరు సరికొత్తగా రీల్స్‌ను (reels) తయారు చేయగలరా అయితే మీకు మంచి ఛాన్స్ వచ్చింది. మీరు వినూత్నంగా ఓ రీల్ వీడియోను (reel video) షూట్ చేయగలిగితే, దీని ద్వారా మీరు ఏకంగా రూ. 1.5 లక్షల వరకు బహుమతిని గెలుచుకోవచ్చు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నమో భారత్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ పోటీని ప్రకటించింది. ఇందులో సినిమా, కంటెంట్ సృష్టికర్తలు తమ సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం ఏం చేయాలి, ఎవరు పాల్గొనవచ్చు, ఎలా చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఎవరైనా పాల్గొనవచ్చు

ఈ పోటీలో మీరు కళాశాల విద్యార్థి అయినా, లేదా ఫిల్మ్ మేకర్ అయినా లేదా కంటెంట్ క్రియేటర్ అయినా పాల్గొనవచ్చు. ఈ పోటీలో మీరు షార్ట్ ఫిల్మ్ లేదా రీల్ వీడియో రూపొందించాలి. ఇందులో మీరు కొత్త, ఆధునిక నమో భారత్ రైలు, RRTS (ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ) స్టేషన్‌ గురించి వీడియో షూట్ చేయాలి. దీనికి ప్రత్యేక శైలి, కథ అంటూ ఏది లేదు. మీరు ఈ వీడియో ద్వారా ప్రత్యేకమైన సృజనాత్మకతను వీడియోలో చూపించాలి.


మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు

RRTS స్టేషన్లు, నమో భారత్ రైళ్ల షూటింగ్, రీల్స్ తయారీకి మీరు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. మీరు ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే మీరు హిందీ, ఆంగ్లంలో మీ చలనచిత్రం లేదా రీల్‌ను పంచుకోవచ్చు. ఈ వీడియో MP4 లేదా MOV ఫార్మాట్‌తోపాటు దీని రిజల్యూషన్ 1080p కల్గి ఉండాలి. సమర్పణకు చివరి తేదీ డిసెంబర్ 20, 2024.


1.5 లక్షల ప్రైజ్ మనీ, రెండు, మూడో బహుమతులు కూడా..

ఈ క్రమంలో మీరు నమో భారత్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్ కోసం రూపొందించిన వీడియోను ఇమెయిల్ pr@ncrtc.inకి పంపించాలి. మీరు ఇమెయిల్‌లో మీ పూర్తి పేరు, సంక్షిప్త సారాంశం, మీ వీడియో సమయాన్ని కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ పోటీలో చివరకు పంపించిన వాటిలో మొదటి ముగ్గురు విజేతలను ప్రకటిస్తారు. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ. 1,50,000, రెండవ స్థానంలో నిలిచిన విజేతకు రూ. 1,00,000, మూడవ స్థానంలో నిలిచిన విజేతకు రూ. 50,000 అందజేస్తారు. ఈ నేపథ్యంలో మీకు కూడా షార్ట్ వీడియోలను క్రియేట్ చేసే టాలెంట్ ఉంటే వెంటనే ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను రూపొందించండి మరి.


ఇవి కూడా చదవండి:

Jobs: గుడ్‌న్యూస్ త్వరలో 3.39 కోట్ల ఉద్యోగాలు.. ఏ రంగంలో ఉంటాయంటే.

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..


Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 15 , 2024 | 07:27 AM