LokSabha Elections: ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధానిని చేస్తే..
ABN , Publish Date - Apr 27 , 2024 | 05:12 PM
వరుసగా మూడోసారి నరేంద్ర మోదీని భారత ప్రధానిని చేయాలని దేశ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శనివారం పోర్ బందరులో బీజేపీ అభ్యర్థి మనుశుక్ మాండవ్యాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు.
పోర్ బందర్, ఏప్రిల్ 27: వరుసగా మూడోసారి నరేంద్ర మోదీని భారత ప్రధానిని చేయాలని దేశ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శనివారం పోర్ బందరులో బీజేపీ అభ్యర్థి మనుశుక్ మాండవ్యాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ అవకాశం ఇస్తే.. ఆయన దేశంలో నక్సలిజానికి, ఉగ్రవాదానికి చరమగీతం పాడతారన్నారు. అయితే కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిందని.. అయితే ఆ ఆర్టికల్ రద్దును కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాశ్మీర్‌లో రక్త ప్రవాహం కోసమే రాహుల్ ఈ విధంగా వ్యవహరించారని అమిత్ షా ఆరోపించారు.
గత అయిదేళ్లలో కాశ్మీర్‌లో ఒక్క రక్తపాత ఘటన కూడా చోటు చేసుకోలేదని అమిత్ షా ఈ సందర్భంగా ఉదాహరించారు. అలాగే దేశంలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ పని చేస్తున్నారనీ వివరించారు.
LokSabha Elections: మమతా బెనర్జీకి మళ్లీ గాయాలు!
అలాగే ప్రదానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దేశంలో ఎలా ఉంది, మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓ సారి ఆలోచించాలని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు. ఇక భారత్‌లో పుల్వామా, యూరీ ఘటనలకు పాక్ దుశ్చర్యలకు పాల్పడితే.. భారత్ మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఆ దేశానికి జవాబు ఇచ్చిందని ఈ సందర్బంగా అమిత్ షా గుర్తు చేశారు.
LokSabha Elections: ఢిల్లీలో ఆప్ గెలుపు కోసం..
అలాగే కాంగ్రెస్ పాలనలో భారత్ ఆర్థిక పరిస్థితి 11వ స్థానంలో ఉండేదని.. కానీ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ ఆర్థిక పరిస్థితి 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. అదీ కూడా కేవలం 10 ఏళ్లలోనే అని అమిత్ షా గుర్తు చేశారు. ప్రధానిగా మోదీకి మరో అవకాశం ఇస్తే.. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద శక్తిగా ఆవతరింప చేస్తారని.. అందుకు తాను గ్యారంటీ అని అమిత్ షా స్పష్టం చేశారు.
Read National News And Telugu News