Mamata Banerjee: మమతా బెనర్జీకి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ABN , Publish Date - Mar 14 , 2024 | 08:41 PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలు అయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యాలను ఆ ఫోటోలో మనం చూడొచ్చు.
పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలు అయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress Party) ఎక్స్ వేదికగా తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్నట్టుగా ఆ ఫోటోలో మనం గమనించవచ్చు. ఆమె ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తుండగా అదుపుతప్పి పడిపోయారని, దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి ఆమెను తరలించడం జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘‘మా చైర్‌పర్సన్ మమతా బెనర్జీకి పెద్ద గాయమైంది. ఆమె వెంటనే కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.