Share News

Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..

ABN , Publish Date - May 13 , 2024 | 02:33 PM

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకతాయిల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ఎయిర్ పోర్టులు, పాఠశాలలు, ఆసుపత్రులకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఆ సమయంలో సదరు సంస్థల సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లఖ్‌నవూ‌లోని గోమతి నగర్‌లో పలు పాఠశాలలకు సోమవారం ఉదయం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.

Bomb Threat: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు..

లఖ్‌నవూ, మే13: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అకతాయిల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. ఎయిర్ పోర్టులు, పాఠశాలలు, ఆసుపత్రులకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఆ సమయంలో సదరు సంస్థల సిబ్బంది పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లఖ్‌నవూ‌లోని గోమతి నగర్‌లో పలు పాఠశాలలకు సోమవారం ఉదయం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.


దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పాఠశాలలోని విద్యార్థులను గ్రౌండ్‌‌లోకి తరలించి.. మీ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లాలంటూ.. వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించింది. మరోవైపు పోలీసులు, భద్రత సిబ్బంది, బాంబు డిస్పాజబుల్ స్క్వాడ్ బృందం ఆ యా పాఠశాలలకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తుంది. ఇంకోవైపు ఆదివారం న్యూఢిల్లీలోని బురారీ, సంజయ్ గాంధీ ఆసుపత్రులకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి.

LoKSabha Elections: పోలింగ్‌ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు


అలాగే అంతకుముందు న్యూఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు అందాయి. ఇక నాగపూర్, గోవా, జైపూర్ విమానాశ్రయాలకు సైతం బాంబు బెదిరింపులు అందాయి. పోలీసులు, భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఇవన్నీ నకిలీ బెదిరింపులని వారు తేల్చి చెప్పారు. ఇంకోవైపు.. ఈ బాంబు బెదిరింపులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 13 , 2024 | 02:34 PM