Share News

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

ABN , Publish Date - Dec 08 , 2024 | 08:33 AM

ఛత్తీస్‌గడ్: వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మరో సారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు.

Chhattisgarh: బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై  మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గడ్: వరుస ఎన్‌కౌంటర్ల (Encounter)లో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు (Maoists).. ప్రతి చర్యగా బీజాపూర్ జిల్లా (Bijapur District)లో పోలీస్ బేస్ క్యాంప్‌ (Police Base Camp)పై మరో సారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు భారీగా కొనసాగాయి. రాకెట్ లాంచర్‌లతో మావోయిస్టులు.. క్యాంప్‌పై దాడి చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. తోటి జవాన్లు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి దాడి చేశారు. ఈ దాడుల వెనుక కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


కాగా శుక్రవారం (డిసెంబర్ 6వ తేదీ) రాత్రి ఛత్తీ్‌సగఢ్‌.. బీజాపూర్‌ పామేడు సమీపంలోని జీడిపల్లి సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌ నాయకుడు మాద్వి హిడ్మా ఆధ్వర్యంలో జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ దాడి దాదాపు 6 గంటల పాటు సాగింది. వందల మంది మావోయిస్టులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. జీడిపల్లిలో సీఆర్‌పీఎఫ్-228కి చెందిన 2 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటిది పూర్తయింది. నిర్మాణంలో ఉన్న రెండో క్యాంపుపై గురువారం అర్ధరాత్రి మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. లేజర్‌ గైడెడ్‌ బాంబులైన బ్యారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్లను (బీజీఎల్స్‌) వినియోగించారు.


ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ప్రతిగా బలగాలు ప్యారా బాంబులు వేశాయి. కాగా, కాల్పుల సమయంలో బీజాపూర్‌ జిల్లా కీలక పోలీస్‌ అధికారులు క్యాంపుల్లోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్యాంపు నిర్మాణంలో పని చేస్తున్న కూలీలు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, సమీప గ్రామస్థులు భయాందోళన చెందారు. సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌లను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారని, పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలోనే దాడికి పాల్పడ్డారని బలగాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 16న పామేడు సమీపంలోని ధర్మారం క్యాంపుపై వందలమంది దాడికి దిగారు. శుక్రవారం దాడి జరిగిన ప్రదేశం.. జీడిపల్లి క్యాంపునకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణ సరిహద్దులోని చర్ల మండలానికి ఇవి 8 నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..

నడ్డా.. అడ్డగోలు మాటలొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 08 , 2024 | 08:38 AM