Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Dec 12 , 2024 | 12:59 PM
National: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గడ్, డిసెంబర్ 12: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా బలగాలను స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో ఈరోజు ఆపరేషన్ జరిగింది. అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. బస్తర్ పరిధిలో 4 జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్‌కు వెళ్లగా.. వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కూంబింగ్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.
హైదరాబాద్‌లో మరోసారి ఠాణాల ప్రక్షాళన..
కాగా.. దేశం నుంచి మావోయిస్టులను ఏరివేయాలని కేంద్రహోంమంత్రి అమిత్‌షా చాలా పట్టుదలతో ఉన్నారు. 2026, మార్చి 31 నాటికి ఆపరేషన్ ఖగార్‌లో భాగంగా ఈ దేశంలో మావోయిస్టు పార్టీ ఉండకూడదన్న అమిత్ షా డెడ్‌లైన్‌తో భద్రతాబలగాలు పెద్దఎత్తున వరుస ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారు. వరుస ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గడ్ దండకారణ్యం యుద్ధ భూమిగా మారింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గతంలో 18 రాష్ట్రాల్లో ప్రభావం ఉన్న మావోయిస్టులు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంకే పరిమితమయ్యారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మట్ అటవీ ప్రాంతం టార్గెట్‌గా భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నాయి. సుమారు లక్షల మంది పారామిలటరీ బలగాలు వరుస ఎన్‌కౌంటర్‌లకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర అణచివేత ధోరణి ఉండటంతో మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో తెలంగాణ సరిహాద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే వరుస ఎన్‌కౌంటర్‌లు మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో అగ్రనేతలు నేలరాలగా, తాజాగా జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో అనేక మంది మావోయిస్టు ముఖ్యనాయకులు ప్రాణాలు కోల్పోయారు.
TG Govt.: ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
బీజాపూర్, సుకుమార్,నారాయణపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో పెద్దఎత్తున భద్రతా బలగాలు మోహరించి మావోయిస్టులను ఏరవేసే పనిలో పడ్డాయి. భద్రతాబలగాలకు మావోయిస్టులకు జరుగుతున్న పోరుతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తతతో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీతో పాటు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో రెండు భారీ ఎన్‌కౌంటర్‌లు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 5న కరకగూడెం ఎన్‌కౌంటర్, డిసెంబర్ 1న చలపాక ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. తెలంగాణలో మావోయిస్టులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన వాతావరణం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి...
Chennai: సముద్రంలో పడవను ఢీకొన్న నౌక
Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా.. ఈ మహిళలు ఏం చేశారో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Read Latest National News And Telugu News