Medha Patkar: పరువునష్టం కేసులో మేథాపాట్కర్‌కు 5 నెలల జైలు
ABN , Publish Date - Jul 01 , 2024 | 05:22 PM
పరువు నష్టం కేసులో హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ కు ఢిల్లీ సాకేత్ కోర్టు 5 నెలల జైలు శిక్ష విధించింది. పిటిషనర్ వీకే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు (Defamation case)లో హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ (Medha Patkar)కు ఢిల్లీ సాకేత్ కోర్టు 5 నెలల జైలు శిక్ష విధించింది. పిటిషనర్ వీకే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 389(3) కింద తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆగస్టు 1వ తేదీ వరకూ జైలుశిక్ష అమలును కోర్టు సస్పెండ్ చేసింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) 23 ఏళ్ల క్రితం మేథాపాట్కర్‌పై ఈ క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు.
ఈ కేసులో మేథాపాట్కర్‌ను దోషిగా నిర్దారిస్తూ గత మే 25న సాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ తీర్పు చెప్పారు. శిక్షపై తీర్పును మాత్రం వాయిదా వేసింది. మేథాపాట్కర్‌కు, ఢిల్లీ ఎల్జీకి మధ్య 2000 నుంచి న్యాయపోరాటం జరుగుతోంది. తనపైన, నర్మదా బచావో ఆందోళన్ (ఎన్‌బీఏ)కు వ్యతిరేకంగాను అడ్వర్‌టైజ్‌మెంట్లు పబ్లిష్ చేరానని వీకే సింగ్‌పై ఆమె కేసు పెట్టారు. అప్పట్లో వీకే సక్సేనా అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓకు చీఫ్‌గా ఉన్నారు. సక్సేనా సైతం ఒక టీవీ ఛానెల్‌లో మేథాపాట్కర్ తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యాలు చేశారని, పరువునష్టం కలిగించే విధంగా పత్రికా ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ రెండు కేసులు పెట్టారు.
Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...
తీర్పుపై మేథాపాట్కర్ స్పందన
కోర్టు తీర్పుపై మేథాపాట్కార్ స్పందిస్తూ, నిజానికి ఎన్నడూ ఓటమి లేదన్నారు. తాను ఎవరినీ అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. తాము తమ పని మాత్రమే చేశామని చెప్పారు. కోర్టు తీర్పును సవాలు చేస్తామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..