Iltija Mufti: హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 08 , 2024 | 07:41 PM
హిందుత్వ ఒక వ్యాధి అని, జైశ్రీరామ్ నినాదాన్ని 'మూకదాడులు'తో ముడిపెడుతూ ఇల్తిజా ముఫ్తీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

శ్రీనగర్: హిందుత్వ (Hindutva)పై జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ ఒక వ్యాధి (illness) అని అన్నారు. జైశ్రీరామ్ నినాదాన్ని 'మూకదాడులు'తో ముడిపెడుతూ 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందుత్వను కించపరచేలా చేసిన వ్యాఖ్యలకు ఇల్తిజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Amit Shah: యాంటీ డ్రోన్ విభాగంతో శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు
హిందుత్వ, హిందూయిజం వేర్వేరని, హిందువుల ఆధిపత్యాన్ని హిందుత్వ కోరుకుంటుందని ఇల్తిజ అన్నారు. ''హిందుత్వకు, హిందూయిజానికి చాలా తేడా ఉంది. హిందుత్వ విద్వేష సిద్ధాంతం. హిందువుల ఆధిపత్యం కోసం 1940లో వీర సావర్కర్ దీనిని వ్యాప్తి చేశారు. ఇండియా అంటే హిందువులదని, హిందువుల కోసమేనని ఆ సిద్ధాంతం చెబుతుంది. ఇస్లాం తరహాలోనే హిందూయుజం కూడా లౌకికవాదం, ప్రేమ, కనికరాన్ని ప్రోత్సహించే మతం. దీన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించ కూడదు. 'జై శ్రీరామ్' నినాదం రామరాజ్యానికి సంబంధించినది కాదు, మూకదాడులతో ముడిపడింది. హిందూయిజానికి వక్రభాష్యం చెబుతుండటం సిగ్గుచేటు. హిందుత్వ అనేది ఒక వ్యాధి'' అని ఇల్తిజ వ్యాఖ్యానించారు.
క్షమాపణ చెప్పాలి: బీజేపీ
హిందుత్వ ఒక వ్యాధి అంటూ ఇల్తిజా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిందుత్వపై పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఇల్తిజా క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేత రవీంద్ర రైనా డిమాండ్ చేశారు. ఆమె వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ కించపరచే వ్యాఖ్యలు తగదని అన్నారు.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణను 2019లో కేంద్ర రద్దు చేయడానికి ముందు మెహబూబా ముఫ్తీని నిర్బంధంలోకి తీసుకుంది. ఆ సమయంలో ఇల్తిజా ముఫ్తీ పేరు ప్రచారంలోకి వచ్చింది. మెహబూబా ముఫ్తీ సోషల్ మిడియా ప్రొఫైల్స్‌ను ఆమె పర్యవేక్షించేది. ఈ ఏడాది జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజ్‌బేహరా సీటు నుంచి ఇల్తిజా పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా వీరి చేతిలో ఓటమి చవిచూసింది.
ఇవి కూడా చదవండి..
Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు
Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!
Read More National News and Latest Telugu News