Share News

Metrorail: డ్రైవర్‌ రహిత మెట్రోరైల్‌ ట్రయల్‌ రన్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:06 PM

డ్రైవర్‌ రహిత మెట్రోరైలు(Driverless metro train) ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. త్వరలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) రెండో విడత ప్రాజెక్ట్‌లో డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు నడపాలని నిర్ణయించింది.

Metrorail: డ్రైవర్‌ రహిత మెట్రోరైల్‌ ట్రయల్‌ రన్‌

చెన్నై: డ్రైవర్‌ రహిత మెట్రోరైలు(Driverless metro train) ట్రయల్‌ రన్‌ ప్రారంభమైంది. త్వరలో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) రెండో విడత ప్రాజెక్ట్‌లో డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్లు నడపాలని నిర్ణయించింది. అందుకోసం తలా 3 బోగీలతో కూడిన 70 మెట్రోరైళ్లను తయారుచేయాలని నిర్ణయించింది. ‘బీఈఎంఎల్‌’ సంస్థతో రూ.3,657.53 కోట్లకు మెట్రోరైళ్లు కొనుగోలు చేసేలా సీఎంఆర్‌ఎల్‌ ఒప్పందం చేసుకుంది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: మరణిస్తూ... ఆరుగురికి పునర్జన్మ


nani6.2.jpg

డ్రైవర్‌ రహిత మెట్రోరైళ్ల ట్రయల్‌ రన్‌ను సీఎంఆర్‌ఎల్‌ ప్రారంభించింది. అందుకోసం ఒక రైలు, మూడు బోగీలనును గత అక్టోబరు నెలలో పూందమల్లి డిపోకు వేర్వేరుగా తరలించారు. 118.9 కి.మీ రెండవ విడత మెట్రోరైలు ప్రాజెక్ట్‌(Metro Rail Project)లో పూందమల్లి-పోరూర్‌ మధ్య నాలుగవ రైలు మార్గం ఏర్పాటవుతోంది. ఈ విషయమై సీఎంఆర్‌ఎల్‌ అధికారులు మాట్లాడుతూ... డ్రైవర్‌ రహిత మెట్రోరైలు ట్రయన్‌ రన్‌ ప్రారంభించామన్నారు.


గంటకు 10 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో తొలివిడత ట్రయల్‌ రన్‌ జరుగుతుందని తెలిపారు. అలాగే, పూందమల్లి-పోరూర్‌ మధ్య గంటకు 40 కి.మీ నుంచి 80 కి.మీ వేగంతో రెండవ విడత ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నామన్నారు. బ్రేకింగ్‌ సిస్టమ్‌ పూర్తిగా పరిశోధించిన అనంతరం, 2025 డిసెంబరులో పూందమల్లి-పోరూర్‌ మధ్య ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2024 | 12:06 PM