Minister: బ్యాంకుల్లో 443 కేజీల బంగారం డిపాజిట్..
ABN , Publish Date - Dec 21 , 2024 | 10:03 AM
రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు కానుకలగా ఇచ్చే బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీని ఆలయాల అభివృద్ధి పథకాలకు కేటాయిస్తున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) వెల్లడించారు.
- దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు
చెన్నై: రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు కానుకలగా ఇచ్చే బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీని ఆలయాల అభివృద్ధి పథకాలకు కేటాయిస్తున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) వెల్లడించారు. దిండుగల్ జిల్లా పళని దండాయుధపాణి ఆలయానికి భక్తులు కానుకగా సమర్పించిన రూ.136 కోట్ల విలువైన 192.984 కేజీల బంగారు నగలను కరిగించి, గోల్డ్ డిపాజిట్ పథకంలో డిజాజిట్ చేసేందుకు స్టేట్ బ్యాంక్ అధికారులకు అందించే కార్యక్రమం శుక్రవారం పళని దండాయుధపాణి ఆలయ ప్రాంగణంలో జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తాం
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖామంత్రి ఆర్.చక్రపాణి, పళని ఎమ్మెల్యే సెందిల్‌కుమార్, రిటైర్డ్ జడ్జి మాల తదితరులతో కలిసి మంత్రి పీకే శేఖర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలి విడతగా 23 ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన బంగారు నగలు కరిగించి 443 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల సంవత్సరానికి రూ. 5.79 కోట్లు వడ్డీ వస్తోందన్నారు. రెండో విడతగా పళని ఆలయంలో 192.984 కిలోగ్రాముల బంగారం, మాసాని అమ్మవారి ఆలయంలో 28 కిలోల బంగారం, తిరుచ్చి గుణశీలన్ ఆలయంలో 12 కిలోల బంగారాన్ని కరిగించి డిపాజిట్ చేసినట్లు తెలిపారు.
భక్తులు ఆలయాలకు కానుకగా సమర్పిస్తున్న ఏనుగులను సక్రమంగా సంరక్షిస్తున్నామని, ప్రస్తుతం ఏనుగులు లేని ఆలయాలకు ఏనుగులను కానుకగా భక్తులు సమర్పించాలని మంత్రి కోరారు. పళని ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం రెండో రోప్‌కారును మలేసియా, జపాన్(Malaysia, Japan) దేశాల్లో మాదిరిగా ఆధునికీకరణ విధానంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి సభ్యులను వచ్చే జనవరిలో నియమించనున్నట్లు మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News