Share News

Minister: హిందూమతంలో కులాల పిచ్చి పెరిగింది..!

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:44 AM

హిందూమతంలో కులాల పిచ్చి కొనసాగుతోందని, ఎటువంటి మార్పులు రావడం లేదని బౌద్ద మతాన్ని స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప(Minister Mahadevappa) ప్రకటించారు.

Minister: హిందూమతంలో కులాల పిచ్చి పెరిగింది..!

- శాంతికి, సమానత్వానికి రూపమైన బౌద్ధమతంలోకి వెళ్తున్నా

- మంత్రి మహదేవప్ప

బెంగళూరు: హిందూమతంలో కులాల పిచ్చి కొనసాగుతోందని, ఎటువంటి మార్పులు రావడం లేదని బౌద్ద మతాన్ని స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప(Minister Mahadevappa) ప్రకటించారు. సోమవారం ధర్మచక్ర పరివర్తనా దినాన్ని పురస్కరించుకుని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. హిందూమతంలో కులాల ప్రాధాన్యం జబ్బు వీడలేదని, ఇకపై మార్పులు వచ్చే లక్షణాలు కనిపించడం లేదన్నారు. స్వాతంత్య్రం, సమానత్వం, భ్రాతృత్వాన్ని బోధించే బౌద్ధ మతాన్ని ఇష్టపడతానని రాసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: ‘వందే భారత్‌’లో నాణ్యతలేని ఆహారం..


వ్యక్తి ఎదుగుదలకు కరుణ, సమానత్వం ముఖ్యమని ప్రస్తావించారు. కుల పిచ్చితో ఉన్న హిందూమతంలో మార్పు వచ్చే లక్షణాలు ఎక్కడా సాధ్యం కావడం లేదన్నారు. అలాంటి మార్పు త్వరలో రావాలన్నారు. అందుకే సమానత్వం, శాంతికి రూపమైన బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తానని ప్రకటించుకున్నారు. భారత మూలమతంగా బౌద్ధధర్మాన్ని ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.


కాగా మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి హోదాలో ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు విజయవంతమయ్యేందుకు దాదాపు 20రోజులుగా మైసూరులోనే ఉంటూ పర్యవేక్షించారు. సాక్షాత్తు మంత్రే హిందూమతంపై విరుచుకుపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దసరా ముగిసిన ఒక్కరోజులోనే ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించడం సర్వత్రా చర్చకు కారణమవుతోంది.


.................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................

Darshan: దర్శన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renukaswamy) హత్యకేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan), ఏ1 నిందితు రాలు పవిత్రగౌడల బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సోమవారం 57వ సీసీహెచ్‌ కోర్టు తీర్పును ప్రకటించింది. హత్య కేసులో జూన్‌ 11న దర్శన్‌ను అరెస్టు చేశారు. ఇటీవలే చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో దర్శన్‌ తరపు న్యాయవాదులు సెప్టెంబరు 21న బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం వారంక్రితమే ప్రక్రియను ముగించి తీర్పును పెండింగ్‌లో ఉంచారు.

pandu3.jpg


అక్టోబరు 14న సోమవారం తీర్పు ప్రకటిస్తామని న్యాయమూర్తి జయశంకర్‌(Justice Jayashankar) వెల్లడించారు. దీంతో పరప్పన అగ్రహార జైలులో ఉన్న పవిత్రగౌడ, బళ్ళారి జైలులో ఉన్న దర్శన్‌ బెయిల్‌ తీర్పుకోసం ఎదురు చూశారు. న్యాయమూర్తి జయశంకర్‌ సోమవారం సా యంత్రం బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసినట్టు ప్రకటించారు. దీంతో దర్శన్‌ మరింతకాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రసన్నకుమార్‌ వాదనలు వినిపించగా దర్శన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది సీవీ నగేశ్‌ వాదించారు.


కాగా బెయిల్‌ తీర్పు ఎలా ఉంటుందోనని ఆదివారం రాత్రి జైలులో దర్శన్‌ తీవ్రమైన ఒత్తిడితో గడిపినట్లు సమాచారం. బెయిల్‌ వస్తుందో, రాదోనని ఆవేదనతో గడిపినట్లు తెలుస్తోంది. తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, బెంగళూరులో చికిత్స జరిపించుకోవాలని దర్శన్‌ ప్రయత్నిస్తున్నట్ల్టు తెలుస్తోంది. ఏ11 నాగరాజు, ఏ12 లక్ష్మణ్‌ బెయిల్‌ పిటిషన్‌లనూ కొట్టివేశారు. ఏ13 దీపక్‌, ఏ8 రవిశంకర్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు


ఇదికూడా చదవండి: Mahesh Kumar Goud: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ఇదికూడా చదవండి: Alcohol Sales: ఖజానాకు దసరా కిక్కు!

ఇదికూడా చదవండి: Papikondalu: పాపికొండలు విహారయాత్ర షురూ

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: కొడంగల్‌.. దశ తిరిగేలా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2024 | 11:44 AM