Share News

Minister: ఆ కొండపైకి భక్తులకు అనుమతి లేదు..

ABN , Publish Date - Dec 12 , 2024 | 10:47 AM

కార్తీకదీపోత్సవం రోజున తిరువణ్ణామలై కొండపైకి భక్తులకు అనుమతి లేదని దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(PK Shekhar Babu) తెలిపారు. అయితే, కొండ పైకి 11,600 మంది భక్తులను అనుమతించనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

Minister: ఆ కొండపైకి భక్తులకు అనుమతి లేదు..

- మంత్రి శేఖర్‌ బాబు

చెన్నై: కార్తీకదీపోత్సవం రోజున తిరువణ్ణామలై కొండపైకి భక్తులకు అనుమతి లేదని దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(PK Shekhar Babu) తెలిపారు. అయితే, కొండ పైకి 11,600 మంది భక్తులను అనుమతించనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. మహాజ్యోతి దీపారాధన కోసం కేవలం ఆలయ సిబ్బంది, పోలీసులు, ఆలయ అధికారులను మాత్రమే అనుమతిస్తామని, జ్యోతిని వెలిగించేందుకు వెళ్ళే వారి వివరాలను అధికారులు తీసుకున్నారని తెలిపారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా, మంగళవారం మహారథోత్సవం జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బలపడిన అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు


శుక్రవారం మహాదీపారాధన జరుగనుంది. సాధారణంగా ఈ జ్యోతి ప్రజ్వలన సమయంలో ఆలయ అధికారులతో పాటు పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుంటారు. కానీ, ఇటీవల ఫెంగల్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తిరువణ్ణామలై కొండ చరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిపుణుల బృందం కొండపైకి వెళ్ళి, జ్యోతి ప్రజ్వలన చేసే ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదికను సమర్పించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండ బాగా తడిసివుందని, అందువల్ల కొండపైకి భక్తులను అనుమతించవద్దని సూచన చేసింది.


nani2.2.jpg

ఈ కారణంగా కార్తీకపౌర్ణమి మహాదీపం రోజున భక్తులను కొండపైకి అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ, కార్తీక దీపోత్సవాలను పురస్కరించుకుని, తిరువణ్ణామలై కొండ శిఖరాగ్రంలో మహాజ్యోతి ప్రజ్వనలో ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. భూగర్భ, గనుల శాఖ డైరెక్టర్‌ శరవణవేల్‌ రాజ్‌ ఆదేశం మేరకు ప్రొఫెసర్‌ ప్రేమలత సారథ్యంలో ఎనిమిది నిపుణులతో కూడిన బృందం మూడు రోజుల పాటు కొండను అధ్యయనం చేసిందన్నారు.


ఆ నిపుణుల నివేదిక మేరకు 350 కిలోల బరువుతో కూడిన కొప్పరై, జ్యోతి ప్రజ్వలన కోసం ఉపయోగించే గాడ గుడ్డ, 40 టిన్నుల్లో 600 కిలోల నెయ్యి ఆలయ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీసుకెళ్తారని తెలిపారు. భరణి దీపం రోజున ఆలయంలోకి 500 మంది భక్తుల సహా అధికారులు, ఆలయ సిబ్బంది కలిపి 11600 మందికి అనుమతిస్తామని తెలిపారు. ఈ కార్తీక దీపోత్సవాలను విజయవంతం చేసేందుకు వీలుగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 10:47 AM